Home Cinema LEO – Bhagavanth Kesari : లియో మరియు భగవంత్ కేసరి కలెక్షన్ల వర్షం.. ఈసారి...

LEO – Bhagavanth Kesari : లియో మరియు భగవంత్ కేసరి కలెక్షన్ల వర్షం.. ఈసారి పండుగా ముందే మొదలైంది గా..

LEO – Bhagavanth Kesari : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈసారి పండగా వాతావరణం ముందుగానే మొదలైంది అని చెప్పుకోవాలి. ఈ నెల 18 న రెండు సినిమాలు విడుదలయాయి. వాటిలో ఒకటి నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి మరియు తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన లియో సినిమా. భగవంత్ కేసరి(LEO and Bhagavanth Kesari Collections) సినిమా ఒక తెలుగు బాషలోనే విడుదలయింది కానీ విజయ్ లియో సినిమా మాత్రం పాన్ ఇండియా చిత్రం గా మన ముందుకు వచ్చింది.

the-collections-list-of-leo-and-bhagavanth-kesari-movies-till-now

మన తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాల జోరు ఎలా ఉంది మరియు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాలలో ఈ రెండు సినిమాలలో ఎక్కువ థియేటర్లు దొరికిన చిత్రం లియో. అవును ఇది అందరికి షాకింగ్ గా ఉండొచ్చు కానీ ఇదే నిజం. ఆంధ్ర మరియు తెలంగాణ లో తెలుగు సినిమా అయినా బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమా కంటే తమిళ డబ్ సినిమా అయినా లియో కు ఎక్కువ థియేటర్లు లభించాయి. ఇదిలా ఉంటె ఈ రెండు సినిమాలలో ఎక్కువ విజయం అందుకున్న చిత్రం లియో.

విజయ్ నటించిన ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది బ్లాక్ బస్టర్ దర్శకుడు లోకేష్ కానగరాజ్. ఈయన తీసిన సినిమాలను తెలుగు ప్రజలు సొంత సినిమా లాగా ఆదరిస్తారు. ఇంకా విజయ్ అంటే మనవారికి ఇష్టం. ఈయన సినిమాలు తెలుగులో కూడా విడుదలవుతూ ఉంటాయి. ఇకపోతే బాక్స్ ఆఫీస్ గురించి మాట్లాడుకుంటే, లియో సినిమా ప్రాంపంచ వ్యాప్తంగా 150 కోట్లు వసూలు చేస్తే, మన భారతదేశం మొత్తంలో 64 కోట్లు వసూలు చేసింది. భగవంత్ కేసరి సినిమా ఇప్తి వరకు 16 కోట్ల రూపాయిలను వసూలు చేసింది.

ఈసారి దసరా పండుగకు విన్నర్ లియో సినిమా అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహమే లేదు. లియో జోరు ఇలాగె కొనసాగితే మాత్రం కొత్త రికార్డులు తిరగరాస్తుంది అని విజయ్ అభిమానులు నమ్ముతున్నారు. లియో(LEO and Bhagavanth Kesari Collections) సినిమా దర్శకుడు ఈ సినిమాను తన మునపటి సినిమాలతో కలిపి ఈ స్టోరీలు అన్ని కలుపుతూ అందరిని ఆశ్చర్పరుస్తున్నాడు.

థియేటర్లలో ఈ సీన్లు చూస్తుంటే మతిపోతుంది అంటూ అభిమానులు చెపుతున్నారు. ఈయన ఇలాంటి కాన్సెప్టులు ఎన్నో మన ఇండియా సినిమా ఇండస్ట్రీ కి పరిచయం చేసి మరింత క్యూరియాసిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాము. `

Exit mobile version