Home Cinema Top Heroines : టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ లో ఉన్న హీరోయిన్ ఎవరంటే.. తెలిస్తే...

Top Heroines : టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ లో ఉన్న హీరోయిన్ ఎవరంటే.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Top Heroines : సినిమా ఇండస్ట్రీలో నటీనటుల స్థానాలు ఎప్పుడు మారుతుందో ఎవరు ఊహించలేరు. మరిముక్యంగా హీరోయిన్ల స్థానాలు ఇటే మారిపోతాయి. ఈరోజు టాప్ హీరోయిన్ గా ఉన్న నటి కొన్ని రోజులకి ఎలాంటి సినిమా ఆఫర్లు లేకుండా ఇబ్బంది పడుతుంటారు. మారుతున్న ట్రెండ్స్ , అభిమానుల అభిరుచుల కారణంగా హీరోయిన్ల పొజిషన్లు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అయితే తాజాగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ ఎవరన్నదానిపై ఓ టాప్ మీడియా ఛానల్ ఆన్లైన్ పోలింగ్ పెట్టింది.

టాప్ టెన్ హీరోయిన్స్‌లో ఎవరెవరు ఉన్నారో మనం ఇక్కడ చూద్దాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ లేకపోయినా సరే టాప్ ప్లేస్ లో దూసుకుపోయింది హీరోయిన్ సమంత. నిజానికి విడాకుల తర్వాత సమంతకు ఒక్క క్రేజీ హిట్ కూడా లేదు. అయితే ఆమె పేరు మాత్రం అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తన క్రేజీ ఫ్యాన్స్ వల్లే టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగింది. దీని తర్వాత టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ రెండో స్థానంలో నిలిచింది.

top-ten-heroines-of-tollywood-cinema-industry

అనుష్క శెట్టి మూడో స్థానంలో నిలిచింది. ఈ అమ్మడు కూడా ఇటీవల సినిమాల్లో నటించలేదు. కానీ తన క్రేజ్ తో మూడవ స్థానం ఖరారు చేసుకుంది. అతిలోక సుందరిగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీ లీల మాత్రం నాలుగో స్థానంలో నిలిచింది. సాయి పల్లవి ఐదో స్థానంలో, రష్మిక ఆరో స్థానంలో, తమన్నా ఏడో స్థానంలో, కీర్తి సురేష్ ఎనిమిదో స్థానంలో, పూజా హెగ్డే తొమ్మిదో స్థానంలో, అనుపమ పరమేశ్వరన్ పదో స్థానంలో ఉన్నారు. ఈ పోలింగ్ రిజల్ట్స్ చూసి అందరు అవాక్కవుతున్నారు.

Exit mobile version