Home Cinema Shraddha Kapoor : ప్రియుడితో శ్రద్ధ కపూర్ రొమాంటిక్ వెకేషన్.. ఫోటోలు హల్చల్..

Shraddha Kapoor : ప్రియుడితో శ్రద్ధ కపూర్ రొమాంటిక్ వెకేషన్.. ఫోటోలు హల్చల్..

Shraddha Kapoor : శ్రద్ధా కపూర్ బాలీవుడ్ నటి. ప్రభాస్ కథానాయకుడిగా వచ్చిన సాహో చిత్రం ద్వారా దక్షిణాది ప్రేక్షకులకు కూడా దగ్గరైంది ఈ భామ. అయితే గత కొద్ది రోజులుగా శ్రద్ధ కపూర్ బాలీవుడ్ స్క్రీన్ రైటర్ అయిన రాహుల్ మోడీతో డేటింగ్ చేస్తోందని చాలా వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలపైనా ఎలాంటి క్లారిటీ లేకపోయింది. కానీ తరచుగా ఈ జంట కలిసి తిరుగుతూ మీడియా దృష్టిని ఆకర్షిస్తుంది. అయితే రీసెంట్ గా వీరిద్దరూ కలిసి రొమాంటిక్ వెకేషన్ తీసుకున్నట్లు కనిపిస్తోంది.

అయితే వీరిద్దరూ కలిసి వెకేషన్‌కు వెళ్లారని వారి సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసిన ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. అయితే కొందరు వీరు షేర్ చేసిన ఫోటోలను కంపేర్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆయా ఫోటోలు చూసిన తర్వాత, వారిద్దరూ నిజంగా ప్రేమికులే అని స్పష్టమవుతుంది. శ్రద్ధ మరియు రాహుల్ మోడీ షేర్ చేసిన ఫోటోల బ్యాక్ గ్రౌండ్ ఒకేలా ఉండటంతో వీరు కలిసి ఉన్నారని అందరూ అనుకుంటున్నారు.

shraddha-kapoor-romantic-vacation-with-boyfriend-photos-trending-everywhere

ఈ జంట రెండు మూడు సార్లు మీడియా కంటిన పడ్డింది. అయితే ఈ ఫోటోలు చూసిన నెటిజనులు ఈ జంట త్వరలో పెళ్లి పీటలు ఎక్కుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి ఈ వార్తలపై ఎలాంటి క్లారిటీ లేదు. ఏది ఏమైనా శ్రద్ధ కపూర్ కూడా త్వరలో పెళ్లి చేసుకొని తన లైఫ్ లో బిజీ అయిపోతుంది అని తన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. శ్రద్ధాకపూర్ ఇటీవల చేసిన సినిమాలు ఏవి అంతలా విజయం సాదించడంలేదనే చెప్పాలి.

Exit mobile version