Home Cinema Allu Arjun – Nani : ఒకే కథతో సూపర్ హిట్స్ ని కొట్టిన నాని...

Allu Arjun – Nani : ఒకే కథతో సూపర్ హిట్స్ ని కొట్టిన నాని అల్లు అర్జున్.. ఏ సినిమాలంటే..

Allu Arjun-Nani : ఒక సినిమాని పోలిన మరో సినిమా ఉండడం మన టాలీవుడ్ లో కొత్తేమి కాదు. కానీ స్క్రీన్ ప్లే ని బట్టి సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. కొన్ని సార్లు సక్సెస్ అవ్వొచ్చు, మరికొన్ని సార్లు విఫలం అవ్వొచ్చు. అలా న్యాచురల్ స్టార్ నాని మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకే ఒకే కథతో రెండు సినిమాలు చేసారు. రెండు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ముందుగా అల్లు అర్జున్ నటించిన ‘ఆర్య 2’ గురించి మనం మాట్లాడుకోవాలి. ఆర్య వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రెండవ సినిమా ఇది. ఇందులో హీరో స్నేహం, ప్రేమ మధ్య నలిగిపోతాడు.

arya-2-dasara

చిన్నతనం నుండి ప్రాణ స్నేహితుడిగా బావించినోడి కోసం జీవితం లో ఏదైనా త్యాగం చెయ్యడానికి సిద్దపడుతాడు హీరో, చివరికి తాను ప్రేమించిన అమ్మాయిని కూడా. ఇక ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘దసరా’ చిత్రం కూడా అంతే. ఈ చిత్రం లో చిన్నతనం నుండి హీరో కి ఒక ప్రాణ స్నేహితుడు ఉంటాడు. అతను తాను ప్రేమించిన అమ్మాయిని స్నేహితుడు కూడా ప్రేమిస్తున్నాడని తెలుసుకొని తన ప్రేమని కూడా త్యాగం చేస్తాడు. ఆ తర్వాత స్నేహం మరియు ప్రేమ కి మధ్య నలిగిపోతూ ఏడుస్తుంటాడు.

ఈ రెండు సినిమాల్లో పాయింట్ కామన్ అయినా, స్క్రీన్ ప్లే వేరు(Allu Arjun Nani). మరో విశేషం ఏమిటంటే ఆర్య 2 కి దర్శకత్వం వహించిన సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల ‘దసరా’ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ‘ఆర్య 2’ మోడరన్ లైఫ్ స్టైల్ లో ఉంటే, ‘దసరా’ చిత్రం మాత్రం రూరం బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. ఆర్య 2 చిత్రం ఆరోజుల్లో 16 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించి సూపర్ హిట్ గా నిల్చింది. ఇక ‘దసరా’ చిత్రం దాదాపుగా 63 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. ఈ రెండు చిత్రాలు మాత్రమే కాదు, గతం లో కూడా ఇలా ఒకే కథ తో వచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి మన ఇండస్ట్రీలో.

హీరో నాని ప్రస్తుతం హిట్ 3, హాయ్ నాన్న అనే రెండు తెలుగు సినిమాలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదే రిలీజ్ అవ్వబోతున్నాయి. హిట్ ఫ్రాంచైజ్ లో విశ్వక్ సెండ్, రెండో పార్ట్ లో అడివి శేష్, మూడు పార్ట్ లో హీరో నాని చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన లాస్ట్ ఇయర్ వచ్చింది. మల్లి అప్పటి నుండి ఇప్పటికి వరకు ఎటువంటి సమాచారం రాలేదు.

ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే, మల్లి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయటానికి పుషప్ 2 సినిమా తో రాబోతున్నాడు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో వేచిచూస్తున్నారు. ఈ సినిమా కచ్చితంగా కొత్త రికార్డులను రాయబోతుంది అని ఫాన్స్ భావిస్తున్నారు.

Exit mobile version