Home Cinema Prabhas : ఏం పెట్టిన తింటా కానీ ఆ ఒక్కటి నావల్ల కాదు.. ప్రభాస్ కి...

Prabhas : ఏం పెట్టిన తింటా కానీ ఆ ఒక్కటి నావల్ల కాదు.. ప్రభాస్ కి అస్సలు నచ్చని ఫుడ్ ఇదే..

రెబెల్ స్టార్ ప్రభాస్ గురించి తెలియని వారు ఎవరుంటారు చెప్పండి, బాహుబలి సినిమాతో దేశం మొత్తం ప్రభాస్ పేరు మారుమోగిపోయింది. ప్రభాస్ అందరిని ప్రేమగా డార్లింగ్ అని పిలుస్తాడు. 40 ఏళ్ళ వయసు దాటినా ఇప్పటికి ఆక్షన్ సినిమాలు చేస్తూ రచ్చ లేపుతున్నాడు ప్రభాస్. మొన్న రిలీజ్ అయిన ప్రభాస్ సలార్ చిత్రం ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. రెండో భాగం ఎపుడు వస్తుందా అని వేచిచూసేలా చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అనే చెప్పాలి.

శృతి హస్సన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా, తనకి కూడా ఇది కంబ్యాక్ సినిమా అని చెప్పుకోవచ్చు. ప్రభాస్ గురించి తన కో-స్టార్స్ ని అడిగితే ఎవరైనా చెప్పేది ఫుడ్ పెట్టి చంపేస్తాడు అనే. ప్రభాస్ ఇంట్లో ఉన్నా షూటింగ్ లో ఉన్నా ఫుడ్ మాత్రం ఇంట్లో ప్రేత్యేకంగా చేపించుకొని తింటాడు. షూటింగ్ సెట్ లో తన ఇతర నటి నటులకి కూడా మంచి భోజనం పెట్టిస్తాడు. ఇది ప్రభాస్ సర్వసాధారణంగా చేసేపని. అందుకే ప్రభాస్ కి ఇంత మంది ఫాన్స్.

prabhas-food

ప్రభాస్ ఒక ఆహార ప్రియుడు అని దెగ్గర ఉన్న వారు చెపుతూ ఉంటారు. ప్రభాస్ ఫేవరెట్ ఐటెం రొయ్యలు, మటన్ బిరియాని. సినిమా కోసం డైట్ లో ఉన్న కూడా వీటిని మాత్రం కచ్చితంగా తింటాడు అట. కానీ ప్రభాస్ కి ఇష్టం లేనిది ఏంటి అనేది చాల మందికి తెలీదు. ప్రభాస్ ఎం పెట్టిన తింటాడు అట కానీ కాకరకాయ మాత్రం అస్సలు దిగదట. కృష్ణంరాజు గారు బలవంతంగా తినిపించేవారు అట. పెద్దగయ్యాక కూడా ప్రభాస్ అది ఒక్కటి మాత్రం అలవాటు కాలేదట.

Exit mobile version