Home Cinema Surya-Mahesh : హీరో సూర్య అసహ్యించుకున్న కథని ఒప్పుకొని ఇండస్ట్రీని షేక్ చేసిన మహేష్ బాబు..

Surya-Mahesh : హీరో సూర్య అసహ్యించుకున్న కథని ఒప్పుకొని ఇండస్ట్రీని షేక్ చేసిన మహేష్ బాబు..

Surya Mahesh Babu : ఒక హీరో చెయ్యాల్సిన సినిమాలను మరో హీరో చెయ్యడం, అవి హిట్ లేదా ఫ్లాప్ అవ్వడం అనేది జరగడం మన ఇండస్ట్రీ లోనే కాదు, ప్రతీ ఇండస్ట్రీ లో జరుగుతున్నదే. గతం లో హీరో సూర్య కూడా అలాంటి క్రేజీ మూవీ ని వదులుకున్నాడట. వైవిధ్యానికి మారు పేరు గా నిల్చిన సూర్య కి కేవలం తమిళం లో మాత్రమే కాదు, తెలుగు లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఆయన చేసే ప్రతీ సినిమా ఎంతో కొత్తరకం గా ఉంటుంది. కానీ సూర్య కి ఒక కథ చెప్పి ఒప్పించాలి అంటే చాలా కష్టం అని అందరూ అంటూ ఉంటారు.

surya-mahesh-babu

గతం లో ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సూర్య తో ఒక సినిమా చెయ్యడానికి ముందుకి వచ్చాడు. ఆ సినిమా స్టోరీ మొత్తం వినగానే, మా ఫ్యాన్స్ చేత బండ బూతులు తిట్టించడానికి సిద్దమయ్యావా అని పూరి జగన్నాథ్ ని అన్నాడట. ఇంతకూ పూరి జగన్నాథ్ హీరో సూర్య కి వినిపించిన స్టోరీ మరేదో కాదు. సూపర్ స్టార్ మహేష్ బాబు తో గతం లో ఆయన చేసిన బిజినెస్ మ్యాన్ చిత్రం. ‘దూకుడు’ లాంటి ఇండస్ట్రీ హిట్ చేసిన తర్వాత మహేష్ బాబు వెంటనే చేసిన సినిమా ఇది. ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు మహేష్ బాబు కనీసం స్టోరీ కూడా వినలేదట(Surya Mahesh Babu), కేవలం పూరి జగన్నాథ్ మీద నమ్మకం తో అతను ఏది చెప్తే అది చేస్తూ పొయ్యాడు.

సినిమా లో చెవులు మూసుకునే రేంజ్ బూతులు చెప్పమన్నా చెప్పేసాడు మహేష్ బాబు. సూర్య ఈ సినిమా చేయకపోవడానికి కారణం ఆ భూతులే. ఇలాంటి కంటెంట్ చేస్తే నా అభిమానులు నన్ను అసహ్యించుకుంటారు అని పూరి తో బిజినెస్ మ్యాన్ స్టోరీ వినగానే అన్నాడట. అయితే ఈ చిత్రం విడుదలై సూపర్ హిట్ అయ్యాక, సూర్య ఈ సినిమాని చూశాడట. చూసిన తర్వాత అయ్యో ఎలాంటి మాస్ క్యారక్టర్ ని మిస్ అయ్యానే అని బాధపడ్డాడట. సినిమా విడుదలైన తర్వాత పూరి జగన్నాథ్ కి మరియు మహేష్ బాబు కి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియచేసిన మొట్టమొదటి హీరో సూర్య నే అట.

అప్పట్లో బిజినెస్ మ్యాన్ చిత్రం తమిళం లో కూడా దబ్ అయ్యింది. అక్కడ కూడా ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మహేష్ బాబు కి తమిళనాడులో మంచి క్రేజ్ ని కూడా తెచ్చిపెట్టింది ఈ చిత్రం. మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం అనే సినిమాలో నటిస్తున్నాడు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాని వచ్చే ఏడాది 2024 సంక్రాంతి టైం కి రిలీజ్ చేదాం అనుకుంటున్నారు సినిమా బృందం.

Exit mobile version