Home Cinema Sadha : ఆ పెళ్ళైన హీరోతో ప్రేమలో పడి మోసపోయిన సదా.. లైఫ్ ఏ నాశనం..

Sadha : ఆ పెళ్ళైన హీరోతో ప్రేమలో పడి మోసపోయిన సదా.. లైఫ్ ఏ నాశనం..

Sadha : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అందం తో కాకుండా కేవలం నటనతో ఇండస్ట్రీ లోకి నెగ్గుకు వచ్చిన అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు సదా. నితిన్ మొదటి సినిమా ‘జయం’ ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైనా సదా తొలిసినిమాతోనే ఇండస్ట్రీ ని షేక్ చేసే రేంజ్ హిట్ ని అందుకుంది. ఆ తర్వాత ఈమెకు టాలీవుడ్ మరియు కోలీవుడ్ లలో వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఆఫర్స్ వస్తున్నాయి కదా అని డబ్బు కోసం ఏ పాత్ర పడితే ఆ పాత్ర చెయ్యకుండా, కేవలం నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలే పోషిస్తూ, తనకంటూ ఒక మంచి గుర్తింపు ని దక్కించుకుంది.

actress-sadha

ఇక మారుతున్న ట్రెండ్ ప్రకారం ఆడియన్స్ అభిరుచులు కూడా మారుతుంటాయి, అలా కొత్తవాళ్లు రాకతో సదా కి డిమాండ్ బాగా తగ్గిపోయింది. ప్రస్తుతం ఆమె బుల్లితెర మీద పలు షోస్ కి జడ్జీ గా వ్యవహరిస్తోంది. ఇది ఇలా ఉండగా సదా(Sadha) ఇప్పుడు 40 ఏళ్ళ వయస్సుకి చేరువలో ఉంది. అయినప్పటికీ ఆమె ఇంత వరకు పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే మిగిలిపోయింది. అలా ఆమె సింగిల్ గా మిగిలిపోవడానికి కారణం ఒక ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో వల్లే అని తెలుస్తుంది. గతం లో ఆమె ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్ తో ప్రేమాయణం నడిపింది.


వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొట్టమొదటి చిత్రం ఎదిరి. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయం లోనే వీళ్లిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త క్రమంగా స్నేహంగా మారి ఆ తర్వాత ప్రేమ రూపం దాల్చింది. అప్పట్లో వీళ్లిద్దరు బెంగళూరు లో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన వీడియోలు మరియు ఫోటోలు మీడియా లో సెన్సేషన్ సృష్టించాయి. దీనితో మాధవన్ ఇంట్లో పెద్ద గొడవలు అయ్యాయట. ఆయనకీ సదా తో ప్రేమాయణం నడుపుతున్న సమయం లోనే పెళ్ళై ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఈ విషయం సదా(Sadha) కి తెలిసే అతనిని ప్రేమించింది.

ఇక ఇంట్లో తెలిసి పెద్ద గొడవ అయిపోవడం తో మీ భార్య కి విడాకులు ఇచ్చేసి నన్ను పెళ్లి చేసుకోమని మాధవన్ ని అడిగిందట. అతడు అప్పుడు పిచ్చా నీకు అన్నట్టుగా చూసి సదా కి దూరంగా ఉండడం ప్రారంబించాడట. ఇక మాధవన్ చేతిలో మోసపోయాను అనే విషయంన్ని అర్థం చేసుకున్న సదా, అప్పటి నుండి ప్రేమ పెళ్లి వంటి వాటికి దూరం గా ఉంటూ వస్తుందట. సద ప్రస్తుతం “సదా నన్ను నడిపే” అనే సినిమాలో లీడ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా జూన్ 24న ప్రేక్షకులముందుకు రానుంది.

Exit mobile version