Tarun Niharika Marriage: సోషల్ మీడియా లో ఈమధ్య వచ్చే వార్తలలో ఏది నిజం ఏది అబద్దం అనేది నమ్మడానికి ప్రేక్షకులకు చాలా కష్టం అయిపోయింది. రూమర్స్ అని పక్కకి తోసేసిన కొన్ని వార్తలు నిజం అని నిరూపించబడుతున్నాయి. నిజం అని నమ్మిన వార్తలు అబద్దం అని తేలుతున్నాయి. దీంతో నెటిజెన్ ఏది నిజం ఏది అబద్దం అనేది తేల్చుకోలేకపోతున్నాడు. గత కొంత కాలం క్రితమే మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక, అలాగే మెగాస్టార్ చిరంజీవి రెండవ కూతురు శ్రీజా ఇద్దరూ కూడా తమ భర్తలతో విడాకులు తీసుకుంటున్నట్టు సోషల్ మీడియా లో ఒక వార్త వచ్చింది.
ఇదంతా కేవలం రూమర్ మాత్రమే అని అందరూ అనుకున్నారు. కానీ అది రూమర్ కాదు నిజమే అని రీసెంట్ గానే నిరూపితం అయ్యింది. ఇప్పుడు గత రెండు రోజుల నుండొయ్ సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న మరో రూమర్ ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది. అదేంటో చూద్దాం. అసలు విషయానికి వస్తే అలనాటి లవర్ బాయ్, సీనియర్ నటి రోజా రమణి కొడుకు తరుణ్ త్వరలోనే నిహారిక కొణిదెల ని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల రోజా రమణి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో నా కొడుకు త్వరలోనే ఇండస్ట్రీ కి చెందిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ చెప్పుకొచ్చింది.
అప్పటి నుండి సోషల్ మీడియా లో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. తరుణ్ నిహారిక పెళ్లి చేసుకోబోతున్నారని(Tarun Niharika Marriage). దీని గురించి త్వరలో అధికారిక ప్రకటన జరగబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత మాత్రం నిజం ఉంది అనేది పక్కన పెడితే, తరుణ్ మరియు నిహారిక ఇప్పటి వరకు కలుసుకున్నట్టు కానీ ఫోటోలు దిగినట్టు కానీ సోషల్ మీడియా ఎక్కడా కనిపించలేదు. అలాంటి వీళ్లిద్దరు పెళ్లి చేసుకోవడం ఏమిటి అని అందరు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇది కేవలం రూమర్ మాత్రమే. రూమర్స్ కి వేంటనే స్పందించి సమాధానం చెప్పే గుణం ఉన్న తరుణ్, దీనికి సమాధానం చెప్తాడో లేదో చూడాలి.
ఆయన సమాధానం చెప్పనంత కాలం సోషల్ మీడియా లో దీని గురించి రోజుకో కథనం పుడుతూనే ఉంటుంది, దానిని ఎవ్వరూ ఆపలేరు. కాబట్టి ముందుగానే స్పందించి అది నిజమో కాదో చెప్పేస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. ఒకవేళ తరుణ్ నిజంగానే నిహారిక ని పెళ్లాడబోతున్నాడు అనే వార్త నిజం అయితే మెగా ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉండుందో చూడాలి. నిహారిక ఇటీవలే ఓకే వెబ్ సిరీస్ చేసింది. హాట్ స్టార్ లో రిలీజ్ అయిన డెడ్ పిక్సెల్ ఆడియన్స్ కి అంత నచ్చలేదు అనే చెప్పాలి. ఇతి వాలే వచ్చిన వార్తల ప్రకారం నిహారిక ఒక కొత్త సినిమా మొదాలు పెట్టింది అంట, పూర్తి వివరాలు రావలసి ఉంది.