Honey Rose Price: టాలీవుడ్ లో హీరోయిన్స్ కి సినిమాల్లో వచ్చే సంపాదన కంటే కూడా యాడ్స్ మరియు షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ చేసినప్పుడు వచ్చే సంపాదనే ఎక్కువ అని విశ్లేషకులు సైతం చెప్పే మాట. హీరోయిన్స్ షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ చేసేటప్పుడు వచ్చే పబ్లిసిటీ మామూలు రేంజ్ లో ఉండదు. కేవలం హీరోయిన్ ని చూసేందుకు వేల సంఖ్యలో అభిమానులు వస్తూ ఉంటారు. అందుకే వాళ్ళు అడిగినంత ఇవ్వడానికి షాపింగ్ మాల్ యాజమాన్యాలు కూడా వెనకాడవు. ఇక సోషల్ మీడియా లో హీరోయిన్స్ కి ఉన్న రీచ్ హీరోలకు ఉండదు.
వాళ్ళని మిలియన్ల కొద్దీ ఫాలోయర్స్ అనుసరిస్తూ ఉంటారు. అందుకే వాళ్ళ చేత ఇంస్టాగ్రామ్ వంటి మీడియా లో తమ బ్రాండ్స్ కి ప్రచారం చేయించుకుంటూ ఉంటారు. ఇకపోతే ‘వీర సింహా రెడ్డి’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా హనీ రోజ్ కి ఇప్పుడు యూత్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఈ చిత్రానికి ముందే ఆమె మలయాళం లో పెద్ద స్టార్ హీరోయిన్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించింది. అక్కడ కూడా ఈమెకి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. అందుకే ఈమె క్రేజ్ ని వాడుకునేందుకు షాపింగ్ మాల్ ఓనర్లు వెంటపడుతున్నారు.
ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ షో రూమ్స్ ని ఓపెన్ చేసినా హానీ రోజ్ ని రిబ్బన్ కటింగ్ కోసం పిలుస్తున్నారు. ఒక్కో షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి ఆమె 50 లక్షల రూపాయిల పారితోషికం తీసుకుంటుంది అట(Honey Rose Price). ఈ స్థాయి రెమ్యూనరేషన్ స్టార్ హీరోయిన్స్ సైతం తీసుకోవడం లేదని టాక్. సౌత్ ఇండియా లో సూపర్ స్టార్ రేంజ్ ఇమేజి ని సొంతం చేసుకున్న సమంత కూడా తన కెరీర్ ప్రారంభం లో కేవలం 25 లక్షలు మాత్రమే తీసుకునేది అట. కానీ హానీ రోజు తెలుగులోకి వచ్చి ఏడాది కూడా పూర్తి కాలేదు. అప్పుడే ఈమె 50 లక్షల రేంజ్ లో తీసుకుంటుంది అనేది మామూలు విషయం కాదు.
ఈమెకి ప్రస్తుతం ఒక్కో సినిమాకి 75 లక్షల రెమ్యూనరేషన్ ని ఇస్తుంటారు. దానికి ఏడాది సమయం కాల్ షీట్స్ ఇవ్వాలి. అదే ఒక ఏడాది లో హానీ రోజ్ ఎన్నో షాపింగ్ మాల్స్ కి రిబ్బన్ కట్టింగ్స్ చెయ్యొచ్చు, దీనిని బట్టి ఆమె సంపాదన ఏడాది ఎంత ఉంటుందో ఊహించుకోండి. ప్రస్తుతం హనీ రోజ్ కి సినిమా అవకాశాల కన్నా ఓపెనింగ్స్ తోనే ఎక్కువ సంపాదిస్తుంది, ఇలా ఎక్కువ రోజులు రాణించటం కష్టమే, ఏదైనా మంచి సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా స్థిరపడితే బాగుండు అనుకుంటున్నారు ఫాన్స్.