Home Cinema Hyper Aadi: ఆ మెగా డైరెక్టర్ పరువు తీసేసిన హైపర్ ఆది.. అంత మాట అనేశాడేంటి..

Hyper Aadi: ఆ మెగా డైరెక్టర్ పరువు తీసేసిన హైపర్ ఆది.. అంత మాట అనేశాడేంటి..

Hyper Aadi: మెగా స్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘భోళా శంకర్‘ చిత్రం వచ్చే నెల 11 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల ఆవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన అజిత్ ‘వేదలమ్’ చిత్రానికి రీమేక్ ఇది. పేరు కి రీమేక్ అని చెప్తున్నారు కానీ, సినిమాని మెగాస్టార్ చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా తీర్చిదిద్దారని, మెగా స్టార్ నుండి మాస్ ఆడియన్స్ మరియు ఫ్యాన్స్ ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ని అయితే కోరుకుంటారో, ఆ ఎలిమెంట్స్ మొత్తం ఈ చిత్రం లో ఉంటాయని మేకర్స్ చెప్పుకొచ్చారు (Hyper aadi about Meher Ramesh).

hyper-aadi-meher-ramesh

అయితే రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ ని చూస్తుంటే అది నిజమే అని అనిపిస్తుంది. మొదటి లిరికల్ వీడియో సాంగ్ కి కూడా ఫ్యాన్స్ నుండి రెస్పాన్స్ అదిరిపోయింది, అలాగే రెండవ లిరికల్ వీడియో సాంగ్ ‘జామ్ జామ్ జజ్జనకా’ కి కూడా బంపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘ప్రతీ ఒక్కరు మెహర్ రమేష్ (Hyper aadi about Meher Ramesh) ని షాడో, శక్తి వంటి ఫ్లాప్ సినిమాలను తీసాడని ట్రోల్ల్స్ చేస్తూ ఉంటారు.

కానీ నేడు బాహుబలి లాంటి పాన్ ఇండియన్ చిత్రం చేసిన ప్రభాస్ అన్న కెరీర్ లో మోస్ట్ స్టైలిష్ మూవీ ఏమిటి అంటే ప్రతీ ఒక్కరు చెప్పే సినిమా పేరు ‘బిల్లా’, దానికి దర్శకుడు మెహర్ అన్న. ట్రోల్స్ చేసే ప్రతీ ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మీ కెరీర్ లో కూడా ఫెయిల్యూర్స్ ఉన్నాయి అనే, మనం తీరిక సమయం దొరికినప్పుడల్లా శ్రీను వైట్ల గారు తీసిన వెంకీ, దుబాయ్ శ్రీను, ఢీ వంటి సినిమాలను చూస్తూ ఉంటాము. అలాంటి క్లాసిక్ సినిమాలు చేసిన శ్రీనువైట్ల నేడు సినిమాలకు దూరంగా ఉంటున్నాడు.

అంటే శ్రీనువైట్ల కి టాలెంట్ లేనట్టా ? ప్రతీ ఒక్కరికీ ఒకరోజు అంటూ వస్తుంది, ఇప్పుడు మెహర్ రమేష్ అన్నకి ఆ రోజు వచ్చింది. ఇక ఆయనని ఎవ్వరు ఆపలేరు’ అంటూ హైపర్ ఆది మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం హైపర్ ఆది కిరణ్ సబ్బవరం హీరోగా నటిస్తున్న రూల్స్ రంజన్ అనే సినిమాలో ఒక మంచి పాత్ర పోషిస్తున్నాడు. రతినం కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

Exit mobile version