Home Cinema Nithya Menen : తనని పెళ్లి చేసుకోమని నిత్యా మీనన్ ని వేధిస్తున్న స్టార్ హీరో..

Nithya Menen : తనని పెళ్లి చేసుకోమని నిత్యా మీనన్ ని వేధిస్తున్న స్టార్ హీరో..

Nithya Menen Marriage : తెలుగు సినిమా ఇండస్ట్రీ అందం మరియు అభినయం ఈ రెండు సమపాళ్లలో ఉండే హీరోయిన్స్ దొరకడం అనేది చాలా కష్టం. లేరు అని చెప్పము కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు, ఒక్కో జనరేషన్ కి ఒక్కో హీరోయిన్ అన్నట్టు. మహానటుడు ఎన్టీఆర్ నాటి కాలం లో సావిత్రి గారిని అలా చూసేవారు, ఆ తర్వాత చిరంజీవి కాలం లో సౌందర్య ని సావిత్రి తో పోల్చి చూసేవారు. ఇక నేటి తరం లో వాళ్ళిద్దరితో పోల్చి చూసిన నటి ఎవరైనా ఉన్నారా అంటే అది నిత్యామీనన్ అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

nithya-menen-dulquer-salmaan

అద్భుతమైన నటన, చూపులు తిప్పుకోలేని అందం ఈమె సొంతం. నటన కి ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తుంది. తన మనసుకి నచ్చకపోతే ఎంత డబ్బు ఇస్తామని చెప్పినా, ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాలో అవకాశం వచ్చిన చెయ్యదు. ఇలాంటి హీరోయిన్స్ ఎంత మంది ఉంటారు చెప్పండి.? అందుకే నిత్యా మీనన్ అందరిలో ఎంతో స్పెషల్. టాలీవుడ్ లోకి అడుగుపెట్టక ముందే నిత్యామీనన్ మలయాళం లో మంచి పేరున్న హీరోయిన్, అక్కడ పెద్ద పెద్ద స్టార్స్ తో కలిసి సినిమాలు చేసింది. వారిలో ప్రస్తుతం యూత్ లో మంచి క్రేజ్ ని దక్కించుకున్న దుల్కర్ సాల్మన్ తో ఈమె ఏకంగా 5 సినిమాలు చేసింది.

అన్ని సూపర్ హిట్ గా నిల్చిన సినిమాలే. అయితే మాలీవుడ్ లో వీళ్లిద్దరు కలిసి ఎక్కువ సినిమాలు చెయ్యడం తో, వీళ్ళ మధ్య ఎఫైర్ ఉందంటూ ఒక వార్త ప్రచారం అయ్యింది. నిత్యా మీనన్ ని దుల్కర్ రెండవ పెళ్లి చేసుకోబోతున్నాడు అని కూడా వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్నీ గతం లో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో నిత్యామీనన్ ని అడగగా దానికి ఆమె సమాధానం చెప్తూ ‘దుల్కర్ నేను మంచి స్నేహితులం. అప్పుడప్పుడు దుల్కర్ నన్ను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసేవాడు(Nithya Menen Marriage), అది తనని పెళ్లి చేసుకోమని కాదు, ఎవరినైనా పెళ్లి చేసుకో అని చెప్పేవాడు, దీనిని మీడియా మరోలాగా ప్రచారం చేసింది.

మేమిద్దరం మంచి స్నేహితులం కాబట్టి ప్రతీ విషయాన్ని పంచుకుంటాము, నాకు వయస్సు వచ్చేసింది కదా పెళ్లి చేసుకో, ఎన్ని రోజులు ఇలా ఒంటరిగా ఉంటావు అని అడిగేవాడు. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పేదానిని’ అంటూ చెప్పుకొచ్చింది నిత్యా మీనన్. ప్రస్తుతం నిత్యా మీనన్ తమిళ్ మరియు మలయాళం సినిమాల్లో నటిస్తుంది. ఈ అమ్ముడు తెలుగు లో సినిమాలు చేసి కొంతకాలం అయింది. సినిమా ఛాన్స్ రాక చేయటంలేదా లేదా టాలీవుడ్ లో ఇంక సినిమాలు చేయకూడదు అని ఫిక్స్ అయ్యిందా తెలీదు.

Exit mobile version