Home Cinema Jagapathi Babu : ఆ హీరోయిన్లకు కొన్ని కోట్లు ఖర్చుపెట్టా.. జగపతిబాబు కెమెరా ముందే చెప్పేసాడు..

Jagapathi Babu : ఆ హీరోయిన్లకు కొన్ని కోట్లు ఖర్చుపెట్టా.. జగపతిబాబు కెమెరా ముందే చెప్పేసాడు..

Jagapathi Babu : సీనియర్ హీరో జగపతిబాబు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకున్న ఈ హీరో, ఇప్పుడు తన రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. విలక్షణమైన విలన్ పాత్రలు చేస్తూ తనదైన స్టైల్ లో దూసుకుపోతున్నాడు. ఈయన హీరో పాత్రలలో కంటే విలన్‌గా నటించి ప్రశంసలు అందుకున్నాడు. కానీ జగపతి బాబు కొన్ని అలవాట్ల వల్ల ఎన్నో ఆస్తులను పోగొట్టుకున్నారు అనే విషయం మన అందరికి తెలిసిందే. జగపతిబాబు గోవాలోని క్యాసినోల్లో జూదమాడి ఎక్కువగా నష్టపోయాడని మరియు

హీరోయిన్లుకు ఖరీదైన బహుమతులు కొని ఇంకా భారీగా ఆస్తులు పోగొట్టుకున్నాడని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. అందులో జగపతిబాబు మాట్లాడుతూ ఈ విషయంపై స్పందించారు. నేను జూదం ఆడటం నిజం, ఎన్నో ఇంటర్వ్యూలో కూడా ఓపెన్ గా చెప్పాను. అయితే ఇది నా ఆర్థిక సమస్యలకు కారణం కాదు. నేను కేవలం రెండు, మూడు కోట్లు జూదం ఆడి కోల్పోయి ఉంటా. కానీ నా ఆస్తి ఇంత పోయింది అని నేను గ్రహించలేకపోయాను.

jagapathi-babu-lost-crores-of-property

జూదం విషయం పక్కన పెడితే హీరోయిన్లకు కాస్టలీ గిఫ్ట్‌లు ఇస్తున్నారా అని యాంకర్ అడిగితె ఇలా చెప్పారు. నాకు హీరోయిన్లను బహుమతులతో మెప్పించే ఉద్దేశం నాకు లేదు. కానీ నా స్నేహితులు హీరోయిన్లు బోలెడంతమంది ఉన్నారు. వారిని కలిసినప్పుడు నేను డబ్బును విచాలవీదిగా ఖర్చుపెడ్తాను. నేను హీరోయిన్స్ తో పార్టీలకు వెళ్లినప్పుడు ఎన్నో కోట్ల డబ్బును ఖర్చుపెట్టానని జగపతిబాబు అన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

Exit mobile version