Home Cinema Balakrishna : నందమూరి అభిమానులకు పుట్టిన రోజు కనుక ఇచ్చిన బాలయ్య.. ఫాన్స్ కు పండగే..

Balakrishna : నందమూరి అభిమానులకు పుట్టిన రోజు కనుక ఇచ్చిన బాలయ్య.. ఫాన్స్ కు పండగే..

Balakrishna : నందమూరి అభిమానులకు బాలయ్య అంటే ఎందుకు ఇష్టం అంటే తన ముక్కుసూటి స్వభావమే అనే చెప్పాలి. బాలయ్య తన అభిమానుల కోసం జీవించే వ్యక్తి అని మనకు తెలుసు. అయితే సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నారు. కానీ జనాలు బాలయ్యను చాలా చాలా ప్రత్యేకంగా చూస్తారు. అయితే నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాంబో అప్‌డేట్ వచ్చేసింది. దీంతో బాలయ్య అభిమానులతో పాటు నెటిజనులు కూడా సంతోషం నెలకొంది.

ఈరోజు బాలయ్య పుట్టినరోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు మరియు ఆయన అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. బాలయ్య బోయపాటి కాంబో అప్‌డేట్‌పై అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా బోయపాటి శ్రీను ప్రత్యేక ప్రకటన చేశారు. వీరి కాంబినేషన్‌లో ఇప్పటికే మూడు సినిమాలు విడుదలయ్యాయి. ఇప్పుడు వీరి కాంబినేషన్ నుంచి నాలుగో సినిమా రాబోతోంది.

update-released-by-boyapati-srinu-on-occasion-of-balakrishna-birthday-fans-are-happy

ఈ విషయపై అఫీషియల్ అప్ డేట్ కూడా వచ్చింది. బాలకృష్ణ బోయపాటి కొత్త సినిమా గురించి అధికారిక సమాచారం విడుదల చేశారు మేకర్స్. తేజస్విని నందమూరి ప్రొడక్షన్ లో 14 వీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రామ్ ఆచంట – గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించడం గమనార్హం. అయితే ఇది అఖండకు సీక్వెల్ అవుతుందా, లేదా కొత్త కథతో వస్తారా అనేది తెలియలిసి ఉంది. బోయపాటి ఒక్క పోస్టర్‌తోనే భారీ అంచనాలు క్రియేట్ చేశాడు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Exit mobile version