Home Cinema జైలర్ నటుడు వినాయకన్ అరెస్ట్.. అలాంటి చెత్త పని చేసి జైల్లో చిప్పకూడు తింటున్నాడు..

జైలర్ నటుడు వినాయకన్ అరెస్ట్.. అలాంటి చెత్త పని చేసి జైల్లో చిప్పకూడు తింటున్నాడు..

jailer-movie-actor-vinayakan-arrested-for-hitting-police

సినిమాల్లో విలన్స్ గా కనిపించే ఆర్టిస్టులు బయట కూడా అదే విధంగా ఉంటారు అనుకోవడం చాలా తప్పు. సోను సూద్ వంటి వారు స్క్రీన్ మీద విలన్ గా కనిపించినప్పటికీ, బయట ఎన్నో సేవాకార్యక్రమాలు చేస్తూ దేవుడిగా ప్రజలవద్ద కొలవబడ్డాడు. అలాంటి విలన్స్ ఇండస్ట్రీ లో చాలా మంది ఉన్నారు. కానీ కొంతమంది విలన్స్(Jailer Vinayakan Arrest) మాత్రం ఆన్ స్క్రీన్ లో ఎంత విలనిజం చూపిస్తారో ఆఫ్ స్క్రీన్ లో కూడా అదే స్థాయి విలనిజం చూపిస్తున్నారు.

అలా ఆఫ్ స్క్రీన్ లో విలనిజం చూపించి జైలు పాలైన వినాయకన్ గురించి నేడు మనం మాట్లాడుకోబోతున్నాము. వినాయకన్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటించిన భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ‘జైలర్’ లో విలన్ గా నటించాడు. సుమారుగా 650 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకున్న ఈ చిత్రం, తెలుగు వెర్షన్ లో కూడా 80 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ చిత్రం లో పవర్ ఫుల్ విలన్ క్యారక్టర్ లో నటించిన వినాయకన్ కి కూడా మంచి క్రేజ్ వచ్చింది. సౌత్ ఇండియా మొత్తం ఆయన పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది.

అయితే నేడు ఆయన పోలీస్ అధికారి పై చెయ్యి చేసుకోవడం వల్ల అరెస్ట్ అవ్వాల్సి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే పూర్తిగా మద్యం సేవించిన వినాయకన్ కొచ్చి నుండి హైదరాబాద్ మీదుగా గోవాకు వెళ్తున్నాడు. ఈ క్రమం లో మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం తప్పు కాబట్టి సిఐఎస్ఎఫ్ అధికారులు ఆపేసారు. దీంతో మద్యం మత్తులో ఉన్న వినాయకన్ ఆవేశంలో కానిస్టేబుల్ ని కొట్టడం తో అతన్ని పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ విషయంపై స్పందించిన వినాయకన్ తానూ ఎలాంటి తప్పు చేయలేదని , సీఐఎస్ఎఫ్ అధికారులు నన్ను విమానాశ్రయంలోని ఒక గదిలో బంధించి దాడి చేసారని, కావాలంటే సీసీటీవీ ఫుటేజీ ని చూసుకోవచ్చని వినాయకన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు(Jailer Vinayakan Arrest).

పోలీసులు తనని ఎందుకు కస్టడీ లో తీసుకుంటున్నారు అనేది ఇప్పటికీ అర్థం కావడం లేదని ఆయన ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేసారు. వినాయకన్ కి అరెస్ట్ అవ్వడం ఇదేమి కొత్త కాదు, గతంలో కూడా ఆయన మద్యం సేవించి చుట్టుపక్కన నివసించేవారికి ఇబ్బంది కలిగిస్తున్నదని ఆరోపణ రావడంతో గత ఏడాది అక్టోబర్ 23 న పోలీసులు అరెస్ట్ చేసారు. మళ్ళీ ఇన్నాళ్లకు ఆయన మరోసారి అరెస్ట్ అవ్వడం గమనార్హం.

Exit mobile version