Kalki Ganesh Idol : ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ లాంటి వసూళ్లను రాబట్టిన చిత్రాలలో ఒకటి రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి’ చిత్రం. కేవలం రాజమౌళి మాత్రమే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలను తియ్యగలడు, ఇక ఎవరి వల్ల కాదు అనే వాదనకు చెక్ పెట్టిన చిత్రమిది. టాలీవుడ్ లో అనేక మంది టాలెంటెడ్ దర్శకులు ఉన్నారు, ప్రతీ ఒక్కరు మరో రాజమౌళి కాగలరు అని అనిపించేలా డైరెక్టర్ నాగ అశ్విన్ ఈ సినిమాని తీర్చిదిద్దాడు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ అని తేడా లేకుండా ప్రతీ భాషలోనూ ఈ చిత్రం అద్భుతంగా ఆడింది.
ఈ కాలం లో ఒక సూపర్ హిట్ సినిమా రెండు వారాలు నికరంగా థియేటర్స్ లో నిలబడి ఆడడమే కష్టం. అలాంటిది ఈ చిత్రం వంద కేంద్రాల్లో 50 రోజులు ఆడింది అంటేనే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయి బ్లాక్ బస్టర్ అనేది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు సుమారుగా 1200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కేవలం రాజమౌళి కి మాత్రమే వెయ్యి కోట్ల రూపాయిల మార్కుని దాటే సత్తా మన టాలీవుడ్ నుండి ఉంది అనే వాదనకు కూడా ఈ సినిమా ద్వారా చెక్ పడింది. ఇదంతా పక్కన పెడితే కల్కి చిత్రం లోని కాంప్లెక్స్ సన్నివేశం, అశ్వర్దమా సన్నివేశం, క్లైమాక్స్ లో కమల్ హాసన్ విశ్వరూపం చూపిస్తూ గాండీవం పైకి లేపే సన్నివేశం ని అభివర్ణిస్తూ ఒక చోట వినాయక మండపం వెలిసింది.
వినాయక చవితి సందర్భంగా, స్టార్ హీరోల అభిమానులు, తమ ఇష్టమైన హీరోలు నటించే సినిమాల పాత్రలతో పోలిన వినాయకుల విగ్రహాలను ప్రతిష్టించడం చాలా సర్వసాధారణం. ఈసారి కూడా అలాంటి విగ్రహాలు చాలానే కనిపించాయి. కానీ అన్నిట్లోకీ కల్కి వినాయకుడు బాగా హైలైట్ అయ్యాడు. సుప్రీమ్ యాస్కిన్ గాండీవం పైకి ఎత్తుతుంటే, పక్కనే అశ్వథామ రూపం లో వినాయకుడు ఉంటాడు(Kalki Ganesh Idol).
అలాగే కల్కి చిత్రం లో బుజ్జి కూడా ఈ మండపం లో కనిపిస్తుంది. సోషల్ మీడియా అంతటా ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ వీడియో నే చక్కర్లు కొడుతోంది. ఇది ఇలా ఉండగా కల్కి పార్ట్ 2 కి సంబంధించిన షూటింగ్ జనవరి నెల నుండి మొదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి అయ్యింది, మిగిలిన షూటింగ్ మర్చి లోపు పూర్తి చేసి ఆగస్టు నెలలో విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారట.