Home Cinema అదృష్టం అంటే జాన్వీ కపూర్దే.. మరో బారి ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్..

అదృష్టం అంటే జాన్వీ కపూర్దే.. మరో బారి ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్..

ప్రస్తుతం ఎక్కడ చూసిన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ పేరు వినబడుతుంది. శ్రీదేవి కుమార్తె గా సినిమా ఇండస్ట్రీకి పరిచమైన ఈ అమ్మడు తన హాట్నెస్ తో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది. బాలీవుడ్ లో ఇప్పటికే ఈ అమ్మడు కొన్ని సినిమాలలో నటించి అక్కడ జనని మెప్పించింది. ఆమె అందం మరియు నటన నైపుణయంతో మన తెలుగు వారి కళ్ళలో పడి బంపర్ ఆఫర్ను కొట్టేసింది. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నటించే చిత్రం దేవరలో ఆయన సరసన హీరోయిన్ గా నటించబోతుంది జాన్వీ.

ఇది ఆమె టాలీవుడ్ డెబ్యూ చిత్రం. తెలుగులో మొదటి సినిమాకే స్టార్ హీరో సరసన నటిస్తుంది. జాన్వీ బాలీవుడ్ లో చేసిన సినిమా ఏవి అంతలా ఆడకపోయినా సరే ఈ ఆఫర్ ఈమెకు దక్కడం అదృష్టం అనే చెప్పాలి. జాన్వీ తెలుగు డెబ్యూ సినిమా విడుదల అవ్వక ముందే మరో స్టార్ హీరో సరసన నటించే అవకాశం కొట్టేసింది. రామ్ చరణ్ సరసన ఈ భామ నటిస్తుంది అని ఇప్పటికే మనకు తెలిసింది. ఇదిలా ఉంటె జాన్వీ మరో స్టార్ హీరో సినిమాలో నటించబోతుంది అంటూ టాలీవుడ్ లో టాక్ వినపడుతుంది.

janhvi-kapoor-grabbed-another-golden-oppurtunity

అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. జాన్వీ రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ లో మహేష్ బాబు పక్కన హీరోయిన్ గా నటిస్తుంది అంటూ కథనాలు వస్తున్నాయి. ఇది కనుక నిజం అయితే ఆమె చేసే ప్రాజెక్ట్స్ లో ఈ ప్రాజెక్ట్ లక్కీ ఒప్పార్చునిటీ గా నిలుస్తుంది అంటూ ప్రేక్షకులు కామెంట్లు పెడుతున్నారు. ఏదిఏమైనా ఈ భామ అన్ని బారి ప్రాజెక్ట్స్ దక్కించుకోవడం ఆమె తల్లి చూసి ఉంటె ఎంతో సంతోషించేది అంటూ శ్రీదేవి అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇకపోతే ఈ న్యూస్ మీద ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

Exit mobile version