Home Cinema Janhvi Kapoor : రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్.. పారితోషికం తెలిస్తే మతిపోతుంది..

Janhvi Kapoor : రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్.. పారితోషికం తెలిస్తే మతిపోతుంది..

Janhvi Kapoor Ram Charan : జాన్వీ కపూర్ బాలీవుడ్ లో హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. ఈ బ్యూటీ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోకి ప్రవేశిస్తుంది. జాన్వీ టాలీవుడ్ లో చేస్తున్న మొదటి చిత్రం దేవర. ఈ సినిమాలో స్టార్ హీరో ఎన్టీఆర్ సరసన నటించడం తన అదృష్టం అని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. దేవర సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేస్తాం అంటూ చిత్ర యూనిట్ ఓ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది.

janvhi-kapoor-ram-charan

ఇదిలా ఉంటె, ఇటీవల నటి తండ్రి బోణి కపూర్ మీడియాతో మాట్లాడుతూ.. జాన్వీ కపూర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. జాన్వీ తన మొదటి చిత్రమే ఎన్టీఆర్ సరసన నటించడం తనకు చాల ఆనందంగా ఉంది అంటూ ఆయన అన్నారు మరియు జాన్వీ టాలీవుడ్ ఇండిస్ట్రీలో తన రెండో చిత్తాన్ని కూడా ఇటీవల ఓకే చేసింది అని బోణి కపూర్ అన్నారు. జాన్వీ రామ్ చరణ్ రాబోయే సినిమాలో హీరోయిన్(Janhvi Kapoor Ram Charan) గా నటించబోతుంది అంటూ మీడియా ముందు చేప్పేసారు.

రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చెంజర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి అయ్యాక బుచ్చి బాబు సానతో కలిసి ఓ సినిమాను సైన్ చేసారు. ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్ బ్యాన్నేరుపై నిర్మిస్తున్నారు సుకుమార్. అయితే ఈ సినిమా యూనిట్ హీరోయిన్ ఎవరు అనేది ఆఫీసియల్ గా విడుదల చేయముందుకే బోణి కపూర్ మీడియా ముందు జాన్వీ చేస్తుంది అని లీక్ చేసారు. ఇండిస్ట్రీలో జాన్వీ కపూర్ ఈ సినిమాకు పారితోషికం అక్షరాలా 8 కోట్లు తీసుకుంటుంది అని వార్తలు గుప్పుమంటున్నాయి.

Exit mobile version