Home Cinema Jr NTR : సీనియర్ ఎన్టీఆర్ 101 వ జయంతికి ఘాట్ వద్దకు తారక్.. ఎమోషనల్...

Jr NTR : సీనియర్ ఎన్టీఆర్ 101 వ జయంతికి ఘాట్ వద్దకు తారక్.. ఎమోషనల్ అయ్యాడు..

Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ కి తన తాత స్వర్గీయ నందమూరి తారక రామారావు అంటే ఎంత ఇష్టమో మనకు తెలిసిందే. తెలుగు భాష మరియు తెలుగు సినిమా గర్వించేదగా వ్యక్తి సీనియర్ ఎన్టీఆర్ అని చెప్పడం ఎలాంటి సందేహం లేదు. ఆయన అద్భుతమైన నాయకుడని చెప్పాలి. ఒక పక్క సినిమాలు, మరో పక్క రాజకీయాలు అంటూ పక్కాగా పెట్టి ప్రజాస్వామ్యం అంటే ఏమిటో చాటిచెప్పిన గొప్ప నటుడు. స్వర్గీయ నందమూరి తారక రామారావు అందరి హృదయాల్లో నిలిచిపోయారు.

ఆయన చనిపోయి ఇన్నేళ్లు గడిచినా ఇప్పటికీ ఆయన చేసిన మంచిపనులు తెలుగు హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతేడాది తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ 100వ పుట్టినరోజు వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. మే 28న ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ గార్డెన్ లోని ఎన్టీఆర్ ఘాటుకు నివాళులర్పించారు. ఈ క్రమంలో ఇప్పటికే తెలుగుదేశం కుటుంబానికి చెందిన పలువురు నేతలు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులర్పించారు.

jr-ntr-at-ntr-ghat-for-his-grandfather-101-birthday

అయితే ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ అయిన తీరు అభిమానులను మరింత ఎమోషనల్ చేసింది. తాత ఘాట్ దగ్గరికి వచ్చిన ప్రతిసారీ వినయంగా, చెప్పులు లేకుండా నమస్కరించి, గౌరవం ఇస్తారు. ఈసారి కూడా ఎన్టీఆర్ అదే చేయడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో చిత్రాలు తీయడానికి వచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎంత ఎదిగిన సరే ఒదిగి ఉండాలి అనడానికి ఎన్టీఆర్ నిదర్శనం అంటూ అభిమానులు ఇంటర్నెట్ లో కామెంట్లు పెడుతున్నారు.

Exit mobile version