Home Cinema Kalki Records : కల్కి సినిమా సాధించిన అరుదైన రికార్డులు ఇవ్వే.. ప్రభాస్ మాస్..

Kalki Records : కల్కి సినిమా సాధించిన అరుదైన రికార్డులు ఇవ్వే.. ప్రభాస్ మాస్..

Kalki Records : టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా కల్కి సినిమాని చేసాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాలోని సన్నివేశాలు విజువల్ ఎఫెక్ట్స్‌కి రోమాలు నిలిచాయి. మరీ ముఖ్యంగా, నాగ్ అశ్విన్ ప్రతి పాత్రను చాలా స్టైలిష్ మరియు రియలిస్టిక్‌గా డిజైన్ చేసాడు. ఇలాంటి సినిమా ఎవరూ తీయలేదనే చెప్పాలి. కల్కి సినిమా కలెక్షన్ల పరంగా సునామీ సృష్టిస్తోంది.

ఇప్పటికే ఎన్నో క్రేజీ రికార్డులు నెలకొల్పాడు. మరి ఈ సినిమా ఎలాంటి క్రేజీ రికార్డులను నెలకొల్పిందో ఇప్పుడు చదివి తెలుసుకుందాం. విడుదలైన ఐదు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.600 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి సంచలన రికార్డు సృష్టించింది కల్కి. షారుఖ్ ఖాన్ జవాన్ ప్రస్తుతం భారతదేశంలో ఒకే వారాంతంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం. కల్కి 520 కోట్ల రికార్డును బ్రేక్ చేసి 555 కోట్లతో మొదటి స్థానంలో నిలిచింది. కల్కి మూడు రోజుల్లోనే హనుమాన్ 350 కోట్ల రికార్డు ను బద్దలుకొట్టింది.

kalki-cinema-achieved-these-rare-records-fans-praising-prabhas

ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా నిలిచింది. అమెరికాలో అత్యంత వేగంగా 100 కోట్లు వసూలు అందుకుంది కల్కి. సంచలన రికార్డు సృష్టించింది. అమెరికాలో 12 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసిన బాహుబలి 2 ఆర్ఆర్ఆర్ రికార్డ్ మినహా అన్ని చిత్రాల రికార్డులను బద్దలు కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్లు సాధించిన భారతీయ చిత్రాలలో కలికి రూ.191 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది.

Exit mobile version