Kalki : ప్రభాస్ అభిమానులకు ఇది నిజంగా పండగా లాంటి వార్తే అని చెప్పాలి. బాహుబలి తర్వాత ప్రభాస్ కు అలాంటి హిట్ లేదు. ప్రభాస్ తన సినీ కెరీర్ డౌన్ అవుతుంది అని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. సీన్ కట్ చేస్తే ఒక్క సినిమా ప్రభాస్ జీవితాన్ని మార్చేసింది. భారతీయ సినిమా చరిత్రలోనే బారి విజయం సాధించిన సినిమాగా నిలిచింది. కల్కి సినిమాతో ప్రభాస్ అన్ని రికార్డులు బద్దలు కొట్టాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ చేసిన చిత్రం కల్కి 2898 AD.
ఈ సినిమా జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ అయింది. అయితే ఇప్పటివరకు సాధించని ఎన్నో రికార్డులను ప్రభాస్ నెలకొల్పాడు. దాదాపు రూ.700 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి చాలా చోట్ల రికార్డులు తిరగరాసింది. హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటివరకు ఏ హీరో సృష్టించని రికార్డులు కూడా క్రియేట్ అయ్యాయి. కల్కి సింగిల్ స్క్రీన్‌ల నుంచి మల్టీప్లెక్స్‌ల వరకు అన్ని సినిమా థియేటర్లు సందడిగా మారాయి.
తాజాగా హైదరాబాద్‌లోని మూడు మల్టీప్లెక్స్‌లు కల్కి సినిమాతో సరికొత్త రికార్డులు సృష్టించాయి. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న మహేష్ బాబు AMB సినిమాస్ మల్టీప్లెక్స్ థియేటర్‌లో 7 స్క్రీన్లు ఉన్నాయి. విడుదలైనప్పటి నుండి, కల్కి అన్ని స్క్రీన్‌లలో దాదాపు 40 షోలను ప్రదర్శించారు. కల్కి కోటి రూపాయల వసూళ్లను రాబడిని. AMB సినిమాస్ లో ఇంత త్వరగా మహేష్ సినిమా కూడా అంత త్వరగా తన థియేటర్లలో రాబట్టలేదు. ఈ అంశం ఇక్కడ హైలైట్ గా మారింది.