Home Cinema Kavya : బంపర్ ఆఫర్ కొట్టేసిన బలగం హీరోయిన్.. మెగా హీరోతో సినిమా కంఫర్మ్..

Kavya : బంపర్ ఆఫర్ కొట్టేసిన బలగం హీరోయిన్.. మెగా హీరోతో సినిమా కంఫర్మ్..

Kavya : కావ్య కళ్యాణ్ రామ్ బలగం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ అమ్మడు తన చిన్నతనం నుండే చైల్డ్ ఆర్టిస్ట్ గా పని చేసింది. గంగోత్రి సినిమాలో నటించి మంచి పేరు సంపాదించుకుంది. కావ్య పెద్దయ్యాక బలగం సినిమాతో హీరోయిన్ గా పరిచామయింది. ఈ సినిమా బారి విజయం సాధించింది. నటి కావ్యకు ఇప్పుడు మరో మంచి ఛాన్స్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మెగా హీరో సినిమాలో నటించే అవకాశం వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

సాయి ధరమ్ తేజ్ హీరోగా హనుమాన్ ఫేమ్ నిరంజన్ రెడ్డి ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో రోహిత్‌ని టాలీవుడ్‌కి దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ఈ సినిమాకు కథానాయికగా కావ్యను ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. మరి కావ్య కథానాయికగా నటిస్తుందా లేక మరో ముఖ్యమైన కథానాయిక ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. కావ్య అయితే ఈ సినిమాలో ఫిక్స్ అంట. ఈ చిత్రానికి సంబరాల ఏటి గట్టు అనే వెరైటీ టైటిల్‌ని పరిశీలిస్తున్నారు.

kavya-sri-ram-is-acting-beside-sai-dharam-tej

ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్. ఇది ఇప్పటికే ప్రారంభం కావాలి, కానీ ఆలస్యం అయింది. ఈ నెలలో ఈ చిత్రం షూటింగ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గ్లిమ్స్ కోసం ప్రత్యేక షూట్ కూడా ప్రారంభించారు. గ్లిమ్స్ విడుదల కానున్నాయి. అదే రోజు టైటిల్‌ని కూడా అధికారికంగా ప్రకటించనున్నారు. విరూపాక్ష సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ చేస్తున్న సినిమా ఇదే. మరి ఈ మెగా హీరోకి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో వేచి చూడాలి.

Exit mobile version