Home Cinema Ketika Sharma : అది చేయడంలో సాయి ధరమ్ తేజ్ కంటే వైష్ణవ చాలా వీక్.....

Ketika Sharma : అది చేయడంలో సాయి ధరమ్ తేజ్ కంటే వైష్ణవ చాలా వీక్.. హీరోయిన్ కేతిక శర్మ బోల్డ్ కామెంట్స్..

Ketika Sharma : పూరి జగన్నాద్ మరియు అతని తనయుడు ఆకాష్ పూరి హీరోగ రొమాంటిక్ అనే సినిమా తీసాడు దర్శకుడు. ఆ సినిమా లో ఆకాష్ సరసన హీరోయిన్ గా కేతిక శర్మ టాలీవుడ్ కు పరిచయమైంది. ఇది ఆమె మొదటి చిత్రం. ఈ చిత్రం అంట విజయం సాధించలేదు, కానీ ఈ బ్యూటీ (Ketika Sharma Bold Comments) కు సినిమా ఆఫర్లు పర్లేదు బానే వస్తున్నాయి. ఇటీవల కేతిక శర్మ మెగా మేనల్లుపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అన్నదమ్ముల గురించి మీడియా ముందు చాలా బోల్డ్ గా మాట్లాడింది.

ketika-sharma-bold-comments-on-sai-dharam-tej-and-vaishnav-tej-at-bro-movie-promotions

కేతిక శర్మ ఇప్పటికే పంజా వైష్ణవ తేజ్ తో రంగ రంగ వైభవంగా సినిమాలో నటించింది. సినిమా స్టోరీ అంతంత మాత్రమే ఉన్న వీరిద్దరి కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ పై బాగా పండింది మరియు ప్రేక్షకులను మెప్పించగలిగింది అనే చెప్పుకోవాలి. ప్రస్తుతం కేతిక పంజా వైష్ణవ తేజ్ అన్న సాయి ధరమ్ తేజ్ తో కలిసి బ్రో సినిమా చేస్తుంది మరియు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మెగా ముల్టీస్టార్రర్ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు.

ఈ సినిమా తమిళంలోని వినోదయ సిత్తం అనే సినిమా కు రీమేక్. తమిళంలో ఇది వారి విజయం అందుకుంది. మా టాలీవుడ్ డైరెక్టర్స్ ఏదైనా రీమేక్ చేస్తే నేటివిటీ తగట్లు స్టోరీలో కొంత మార్పులు చేర్పులు చేస్తారు. అలానే బ్రో పవన్ సాయి ధరమ్ సినిమాలో కూడా కొని మార్పులు చేసారంట. ఈ సినిమాలో పవన్ దేవుడి పాత్రలో నటిస్తున్నాడని ఇప్పటకే ట్రైలర్ ద్వారా అర్ధం అవుతుంది. ఈ సినిమా కు డైరెక్టర్ – ఆక్టర్ సముద్రఖని దర్శకత్వం వహించారు మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడు ఇంకా స్క్రీన్ ప్లే అందించారు.

బ్రో సినిమా ట్రైలర్ ఈ మధ్య రిలీజ్ అయ్యింది మరియు పవన్ అభిమానులకు చాల రోజుల తరువాత జోష్ వచ్చిందనే చెప్పుకోవాలి. బ్రో సినిమా ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బన్నేరుపై నిర్మించగా ఈ సినిమా జులై 28 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా కోసం మెగా అభిమానులు మరియు పవన్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా (Ketika Sharma Bold Comments) ప్రొమోషన్స్ కోసం చిత్ర యూనిట్ ఇంటర్వ్యూలలో పాలుగొన్నది మరియు కేతిక శర్మ మాట్లాడుతూ ఆసక్తి కర విషయాలు బయటపెట్టింది.

అదేంటంటే, బ్రో సినిమా లో ఆమె సాయి ధరమ్ తేజ్ లవర్ గా నటించిందట మరియు తన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుందని కేతిక చెప్పింది. కేతిక శర్మను అక్కడ ఉన్న ఇంటర్వ్యూయర్ తేజ్ బ్రదర్స్ గురించి చెప్పమని అడ్దగ్గ.. ఆమె ఈ బ్రదర్స్ పై కామెంట్స్ చేసింది. అదేంటో ఇప్పుడు చూదాం. సాయి ధరమ్ తేజ్ కొత్త వారితో ఇట్టే కలిసి పోతాడు మరియు జోకులు వేసుకుంటూ చాలా సరదాగా ఉంటాడు. కానీ వైష్ణవ తేజ్ మాత్రం ఈ విషయం చాలా వీక్.. ఎవరితో పడితే వాళ్లతో క్లోజ్ గ్గా ఉండదు అంటూ వ్యాఖ్యలు చేసింది.

Exit mobile version