Home Cinema Puri Jagannadh : ఇన్ని ప్లాపులు ఉన్న పూరి హీరో రామ్ ని ఎలా ఒపించాడు.....

Puri Jagannadh : ఇన్ని ప్లాపులు ఉన్న పూరి హీరో రామ్ ని ఎలా ఒపించాడు.. డబుల్ ఇస్మార్ట్ శంకర్..

Ram Pothineni Puri Jagannadh: ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘లైగర్’ చిత్రం పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం తో పూరి జగన్నాథ్ కి అటు ఆర్థికంగా ఇటు కెరీర్ పరంగా మామూలు డ్యామేజ్ జరగలేదు. ఈ ఫ్లాప్స్ అనేది ఆయనకీ కొత్తేమి కాదు, గతం లో కూడా ఎన్నో ఫ్లాప్స్ వచ్చాయి. కానీ ఆ సినిమాలు ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా ఒకసారి చూసేవిధంగా అయితే కచ్చితంగా ఉండేవి. పూరి జగన్నాథ్ లో ఇంకా టాలెంట్ ఉంది,పర్వాలేదు ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా బౌన్స్ బ్యాక్ అవుతాడు అని అందరూ అనుకునేవాళ్లు.

ram-pothineni-puri-jagannadh

కానీ లైగర్ చిత్రం చూసిన తర్వాత పూరి జగన్నాథ్ బుర్ర లో ఉన్న గుజ్జు మొత్తం మాయం అయిపోయింది అని ఆయన అభిమానులు సైతం చెప్పుకొచ్చారు. ఈ సినిమా దెబ్బ కి పూరి జగన్నాథ్ పేరు ఎత్తితేనే ఆమడ దూరం లో పారిపోతున్నారు మన స్టార్ హీరోలు మరియు కుర్ర హీరోలు. ఒక్కరు కూడా ఆయనకీ అవకాశాలు ఇచ్చే సూచనలే కనిపించలేదు. అలాంటి సమయం లో ప్రముఖ యంగ్ హీరో రామ్ పూరి జగన్నాథ్ తో కలిసి ‘డబుల్ ఇస్మార్ట్’ అనే చిత్రాన్ని చెయ్యబోతున్నారు. రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన పూజ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి.

ఈ కార్యక్రమానికి పూరి జగన్నాథ్ మరియు ఛార్మి తో పాటుగా రామ్ కూడా పాల్గొన్నాడు (Ram Pothineni Puri Jagannadh). గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ అనే చిత్రం ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. హిట్ కోసం మొహం వాచిపోయిన రామ్ మరియు పూరి జగన్నాథ్ ఇద్దరి కెరీర్స్ ని మరోసారి గాడిలో పెట్టిన చిత్రం ఇది. అలాంటి బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ అంటే ప్రేక్షకుల్లో మరియు అభిమానుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమా మీద కూడా ట్రేడ్ లో అంచనాలు ఉన్నాయి, అయితే ఇస్మార్ట్ శంకర్ సినిమా ఆ రేంజ్ లో హిట్ అవ్వడానికి కారణం పాటలు.

మణిశర్మ అందించిన పాటలు యూత్,మాస్ ని విపరీతంగా అలరించాయి. ఇక ఆ పాటలకు రామ్ వేసిన స్టెప్పులు కూడా ఈ సినిమా సక్సెస్ కి దోహదపడింది. మరి అన్నీసార్లు ఇలాంటి మ్యాజిక్స్ పనిచేయవు. టేకింగ్ అనేది చాలా ముఖ్యం, మరి పూర్తి గా ఫామ్ కోల్పోయిన పూరి జగన్నాథ్ ఈ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వస్తాడో లేదో చూడాలి. హీరో రామ్ స్కంద అనే సినిమా 15 సెప్టెంబర్ న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. పూరితో చేస్తున్నా డబల్ ఇస్మార్ట్ శంకర్ వచ్చే ఏడాది మార్చ్ న రిలేస్ అయ్యే అవకాశం ఉంది.

Exit mobile version