Home Cinema సినీ ఇండస్ట్రీ లో విషాదం.. ప్రముఖ హాస్య నటుడు మృతి..

సినీ ఇండస్ట్రీ లో విషాదం.. ప్రముఖ హాస్య నటుడు మృతి..

kollywood-popular-comedian-seshu-is-no-more-diead-due-to-heart-problem

కోలీవుడ్ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హాస్య నటుడు శేషు మరణించారు. 60 ఏళ్ళ వయసున్న శేషుకు పది రోజుల క్రితం గుండె పోటు రావటంతో హాస్పిటల్లో చేర్చారు కుటుంబ సభ్యులు. ఆయన గత 10 రోజుల నుండి ఆసుపత్రిలోనే ఉన్నారు. ఇక మంగళవారం ఉదయం చివరి శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు శోక సముద్రంలో మునిగిపోయారు. ఈ యన కుర్ర వయసు వారికి అంత తెలియనప్పటికీ, మన తండ్రి వయసు వారికి బాగా సుపరిచితం. ఇలామై, పారిస్ జయరాజ్, వేలాయుధం, గుల్ గుల్ వంటి సినిమాల్లో నటించి మంచి ఆదరణ పొందారు. ఈయన తన సినీ కెరీర్ లో పాతిక సినిమాలకు పైగా చేసారు. ఈయన చివరిగా నటించిన సినిమా ‘వాదకుపట్టి రామస్వామి’. రేపు ఉదయం ఈయన బొయితికకాయానికి రేపు అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక ఈయన మరణ వార్త విని తమిళ్ ఇండస్ట్రీ నటులు తమ సంతాపం తెలియచేసారు.

Exit mobile version