Home Cinema Prabhas: చివరిగా ప్రభాస్ తో సినిమా చేసి సినిమాలకు గుడ్ బాయ్ చెప్పనున్న స్టార్ డైరెక్టర్..

Prabhas: చివరిగా ప్రభాస్ తో సినిమా చేసి సినిమాలకు గుడ్ బాయ్ చెప్పనున్న స్టార్ డైరెక్టర్..

Prabhas: ప్రస్తుతం సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో రాజమౌళి మరియు శంకర్ తర్వాత టాప్ మోస్ట్ డైరెక్టర్ ఎవరు అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు లోకేష్ కనకరాజ్. సందీప్ కిషన్ తో ‘నగరం’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి డైరెక్టర్ గా పరిచయమైనా లోకేష్, ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీ కి వెళ్లి కార్తీ తో ‘ఖైదీ’ అనే చిత్రం చేసాడు. ఈ సినిమా తెలుగు మరియు తమిళం భాషల్లో పెద్ద హిట్ అయ్యింది(Prabhas Lokesh Kanagaraj). ఈ చిత్రం తర్వాత లోకేష్ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. విజయ్ తో మాస్టర్ , కమల్ హాసన్ తో విక్రమ్ వంటి సినిమాలు తీసి సౌత్ ఇండియా ని షేక్ చేసాడు.

prabhas

ఈ డైరెక్టర్ తో మాకు కూడా ఒక సినిమా కావాలి అని ప్రతీ స్టార్ హీరో అభిమాని కోరుకునే డైరెక్టర్ అయ్యాడు. కేవలం లోకేష్ అనే బ్రాండ్ మీద వందల కోట్ల బిజినెస్ జరుగుతుంది. ప్రస్తుతం లోకేష్ దర్శకత్వం లో తెరకెక్కిన ‘లియో’ చిత్రం ఈ నెల 20 వ తారీఖున విడుదలకు సిద్ధం అవుతుంది. విజయ్ హీరో గా నటించిన ఈ సినిమా కోసం తమిళ ప్రేక్షకులు ఎంతలా ఎదురు చూస్తున్నారో, తెలుగు ప్రేక్షకులు కూడా అంతలా ఎదురు చూస్తున్నారు(Prabhas Lokesh Kanagaraj). రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రానికి ప్రస్తుతం ఉన్న హైప్ లో యావరేజి టాక్ వచ్చినా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద 600 కోట్ల రూపాయిలు వసూలు చేసేలా ఉంది. ఈ చిత్రం తర్వాత లోకేష్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. ఆ చిత్రం పూర్తి అవ్వగానే కార్తీ తో ‘ఖైదీ 2 ‘ చెయ్యబోతున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత సూర్య తో ‘రోలెక్స్’, ‘ఇరుంబు కై మాయావి’ అనే చిత్రాలు చేసిన తర్వాత విక్రమ్ 2 చేస్తాడు. ఇక చివర్లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తో ఒక సినిమా చేసి, సినిమాలకు గుడ్బై చెప్పేస్తాడట. లోకేష్ తన ప్రతీ ఇంటర్వ్యూ లో పది సినిమాలు చేసి రిటైర్ అయిపోతాను అని చెప్తూనే ఉన్నాడు.

ఎదో సరదాకి అంటున్నాడు లే అని మనం అనుకున్నాం, కానీ ఆయన చెప్పిన మాట మీదనే కట్టుబడి ఉన్నాడు. ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు. ప్రభాస్ సలార్ సినిమా వచ్చే డిసెంబర్ లో రిలీజ్ కు సిద్ధం అవుతుంది. ఈ సినిమా షారుక్ ఖాన్ సినిమా ఒకేరోజు రిలీజ్ అవ్వబోతున్నాయి. ఫాన్స్ మాత్రం సలార్ సినిమా ట్రైలర్ కోసం ఎంతగానో వేచి చూస్తున్నారు.

ఈ సినిమాతో ప్రభాస్ తన పాత రికార్డు లను తిరగరాయ నున్నాడు. సలార్ సినిమా కానీ పొరపాటున ప్లాప్ ఐతే మాత్రం ప్రభాస్ కెరీర్ కి గుడ్ బాయ్ చెప్పేయొచ్చు. కానీ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వటం కంఫర్మ్.

Exit mobile version