Home Cinema Sitara : ఏ స్టార్ హీరో కూతురు చేయలేని పని చేసిన సితార.. మహేష్ బాబునే...

Sitara : ఏ స్టార్ హీరో కూతురు చేయలేని పని చేసిన సితార.. మహేష్ బాబునే మించిపోయింది..

Sitara Times Square : తెలుగు సినిమా గర్వించదగ్గ హీరోలలో ఒకడు సూపర్ స్టార్ మహేష్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన, బాలనటుడిగానే ఎన్నో విజయాలను అందుకున్నాడు. ఆ తర్వాత సోలో హీరో గా ‘రాజకుమారుడు’ చిత్రం తో ఎంట్రీ ఇచ్చి,మురారి సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకొని , ఒక్కడు చిత్రం తో స్టార్ హీరో గా ఎదిగాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకు వచ్చిన పోకిరి సినిమాతో సూపర్ స్టార్ గా ఎదిగి యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఒక రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

sitara-times-square

ప్రస్తుతం ఆయనకీ ఏ రేంజ్ స్టార్ స్టేటస్ వచ్చిందంటే, ఫ్లాప్ కంటెంట్ సినిమాలను కూడా సూపర్ హిట్ చేసేంత. ఇప్పుడు ఆయన రాజమౌళి తో కలిసి నటించబోయే సినిమాతో ఏకంగా పాన్ వరల్డ్ స్టార్ మాకెట్ లోకి అడుగుపెట్టి హాలీవుడ్ సినిమాలకు పోటీ ఇవ్వబోతున్నాడు. ఇది ఇలా ఉండగా మహేష్ బాబు కూతురు సితార చాలా చలాకి అమ్మాయి అనే సంగతి అందరికీ తెలిసిందే. తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తనకి సంబంధించిన ఎన్నో డ్యాన్స్ వీడియోలు మరియు కుకింగ్ వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈమె మాట్లాడే ఇంగ్లీష్ అచ్చం అమెరికన్ ఇంగ్లీష్ లాగ ఉంటుంది.

చిన్నప్పటి నుండి చదువుకుంది మొత్తం హైదరాబాద్ లోనే, కానీ ఆమె ఇంగ్లీష్ మాత్రం అమెరికన్ ఇంగ్లీష్ తో పోలి ఉంటుంది అని మహేష్ బాబు చాలా సందర్భాలలో మురిసిపోతూ చెప్పాడు కూడా. ఇక పోతే సితార ఈ వయస్సు లో నుండి కమర్షియల్ యాడ్స్ లో నటించడం మొదలు పెట్టేసింది. రీసెంట్ గానే ఆమె ఒక జ్యువెలరీ షాప్ కి యాడ్ ఇచ్చింది. ఈ యాడ్ ఏకంగా న్యూ యార్క్ టైమ్స్ స్క్వేర్ లో ప్రదర్శించారు. దీనికి మహేష్ బాబు ఎంతో మురిసిపోతూ, ట్విట్టర్ లో పెట్టిన ఒక ట్వీట్ తెగ వైరల్ గా మారింది.

ఇంత చిన్న వయస్సులో నా కూతురు టైం స్క్వేర్ వాల్స్ మీద కనిపించడం అనేది ఒక తండ్రి గా నాకు ఎంతో గర్వం గా ఉంది(Sitara Times Square), నా కూతురు మహాలక్ష్మి లాగ వెలిగిపోతుంది అంటూ మహేష్ బాబు ఒక ట్వీట్ వేసాడు. ఇది వరకు ఆయన సితార కి సంబంధించిన డ్యాన్స్ వీడియోలను కూడా ఎన్నో షేర్ చేసాడు. చిన్న వయస్సు లోనే డ్యాన్స్ లోని అన్నీ ఫార్మ్స్ నేర్చుకుంది సితార. ఏది ఏమైనా కూడా ఏ స్టార్ హీరో కూతురు చేయలేని పని సితార చేయగలిగింది అనుకుంటున్నారు నెటిజనులు. మహేష్ బాబునే మించిపోయింది మా సితార అని కూడా కొందరు యూజర్లు తమ అభిప్రాయం తెలిపారు.

Exit mobile version