Home Cinema Mahesh Babu: ఆ కుర్ర డైరెక్టర్ తో మహేష్ బాబు సినిమా ఫిక్స్.. ఇక ఫాన్స్...

Mahesh Babu: ఆ కుర్ర డైరెక్టర్ తో మహేష్ బాబు సినిమా ఫిక్స్.. ఇక ఫాన్స్ ని ఎవ్వరు ఆపలేరు..

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి కొత్త సినిమా విడుదలై సంవత్సరం దాటింది. ఆయన హీరో హెగా నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్రం గత ఏడాది మే 12 వ తారీఖున విడుదలై యావరేజి ఫలితం ని దక్కించుకుంది(Mahesh Babu Director Sandeep). ఈ చిత్రం తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తో సినిమా చెయ్యబోతున్నాని మహేష్ బాబు ఇది వరకే ప్రకటించాడు. రాజమౌళి కూడా అధికారికంగా ఖరారు చేసాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకునే దిశగా అడుగులు వేస్తున్న ఈ ప్రాజెక్ట్, అతి త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని జరుపుకోబోతుంది.

director-sandeep-reddy

వచ్చే ఏడాది జనవరి ప్రారంభం నుండి మార్చి నెల వరకు ఈ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో మహేష్ బాబు కూడా పాల్గొనబోతున్నారు.అయితే ఈ సినిమా ప్రారంభం కాకముందే, ఈ చిత్రం తర్వాత మహేష్ చెయ్యబోయే సినిమా గురించి సోషల్ మీడియా లో ఒక వార్త గత రెండు రోజులుగా చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తీసిన సందీప్ రెడ్డి వంగ తో మహేష్ బాబు ఒక సినిమా చేయబోతున్నట్టు సమాచారం(Mahesh Babu Director Sandeep). చాలా కాలం క్రితమే ఆయన మహేష్ ని కలిసి స్టోరీ చెప్పాడు. మహేష్ కి స్టోరీ లైన్ నచ్చింది, పూర్తి స్థాయి స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకొని రమ్మన్నాడు.


ఈ లోపు ప్రభాస్ తో ‘స్పిరిట్’, అల్లు అర్జున్ తో ఒక సినిమా కి కమిట్ అవ్వాల్సి వచ్చింది. గత రెండేళ్ల నుండి రణబీర్ కపూర్ తో ‘ఎనిమల్’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం పూర్తి అవ్వగానే ప్రభాస్ తో స్పిరిట్ చిత్రం ప్రారంభిస్తాడు. రాజమౌళి తో సినిమా పూర్తి అవ్వడానికి మహేష్ కి కనీసం మూడేళ్ళ సమయం పడుతుంది కాబట్టి, ఈలోపు సందీప్ రెడ్డి వంగ కమిట్ అయిన చిత్రాలు మొత్తం పూర్తి చెయ్యాలని అనుకుంటున్నాడు అట. ఇక మహేష్ విషయానికి వస్తే రాజమౌళి తో సినిమా ప్రారంభించే ముందే, మరో సినిమా చెయ్యాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

ఆయనకీ ‘సరిలేరు నీకెవ్వరూ’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు అని టాక్. అనిల్ రావిపూడితో చేసే బదులు ముందుగా సందీప్ వంగ సినిమా పూర్తి చేయమంటూ మహేష్ బాబు ఫన్స్ సోషల్ మీడియా లో మహేష్ ని ట్యాగ్ చేసి అడుగుతున్నారు. అసలు గుంటూరు కారం సినిమా ఎపుడు రిలీజ్ అనే విషయం పై క్లారిటీ ఇంకా రాలేదు.

అసలు హీరోయిన్ ఎవరు, పూటకి ఒకరిని మారుస్తున్నారు అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా.? అసలు ఈ సినిమా మహేష్ ఎందుకు ఒప్పుకున్నాడు.? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో మహేష్ ఫాన్స్ మదిలో ఉన్నాయి.గుంటూరు కారం సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందా అంటే మాకు కూడా డౌట్ ఏ కొడుతోంది.

Exit mobile version