Prabhas : బాహుబలి సిరీస్ తో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆల్ ఇండియా హీరో అయిపోయాడు. ఆ తర్వాత తీసిన ప్రతీ సినిమా పాన్ ఇండియా లెవల్లో విడుదలవుతున్నాయి. ఫలితాలు ఎలా ఉన్నా ప్రతి సినిమా కూడా ప్రతిష్టాత్మకంగానే తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్(Prabhas Mahesh Babu) చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. వాటిలో ఒకటి కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సలార్. ఈ సినిమా కోసం దేశమంతా ఆతృతగా ఎదురు చూస్తోంది. కానీ సలార్ చిత్రం మరోసారి వాయిదా పడటంతో ప్రభాస్ ఫ్యాన్ తీవ్ర నిరాశ చెందారు.
ఇలా ప్రభాస్ గత చిత్రం ఆదిపురుష్ కూడా పలుమార్లు వాయిదా పడి విడుదలైన తర్వాత ఫ్లాప్ కావడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఇదిలా ఉండగా.. నిరాశలో ఉన్న ప్రభాన్ అభిమానులకు సలార్ చిత్ర బృందం గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పక్కాగా ప్లాన్ చేసి.. ఈ సినిమాకు మరే సినిమా పోటీ లేకుండా డేట్ సెట్ చేస్తారట. నిజమేంటో తెలియాలంటే మూవీ మేకర్స్ నుంచి అఫిషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది.
ఫస్ట్ పార్ట్ ఈ నెలాఖరులో రిలీజ్ చేసి ఆపై రెండో భాగంపై కసరత్తులు చేయాలని ముందుగా ప్లాన్ చేసుకున్నారట మేకర్స్. వచ్చే సంక్రాంతి కానుకగా సలార్ సినిమాను రిలీజ్ చేయాలన్న ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. సలార్ సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగానే కాకుండా… ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు ఎదురు వెళ్లేందుకు కూడా బాలీవుడ్ కు చెందిన స్టార్ హీరోల సినిమాలు కూడా భయపడుతున్నాయి.
అలాంటిది ఉన్నట్లుంది సలార్ సినిమా సెప్టెంబర్ నుంచి సంక్రాంతికి వెళ్లిపోతే.. ఇప్పటికే పండగ సీజన్ ను క్యాష్ చేసుకునేందుకు రెడీ గా ఉన్న మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకు చాలా పెద్ద దెబ్బ అని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటికే మహేష్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చేశారు. ప్రభాస్ సలార్ సినిమా కూడా సంక్రాంతికే వస్తే కచ్చితంగా గుంటూరు కారం సినిమాపై ఎఫెక్ట్ పడుతుంది.
అసలే గుంటూరు కారం సినిమా(Prabhas Mahesh Babu) షూటింగ్ పడుతూ లేస్తూ ముందుకు సాగుతుంది. ఎట్టి పరిస్థితిలోనూ సంక్రాంతికి విడుదల చేయాలన్న గట్టిప్రయత్నంలో ఆ చిత్ర మేకర్స్ ఉన్నారు. ఈ టైంలో సలార్ కూడా సంక్రాంతి బరిలో నిలవడం గుంటూరు కారంకు మూలిగేనక్క మీద తాటిపండు పడ్డ చందంగా తయారయ్యేలా ఉంది. ఒక వేళ సలార్ సినిమాకు గుంటూరు కారం ఎదురు వెళ్లడం అంటే అది రిస్క్ అని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ సమయంలో కచ్చితంగా థియేటర్ల సమస్య కూడా ఏర్పడుతుంది.