Home Cinema Prabhas : ప్రభాస్ అసలు పేరేంటో తెలుసా.. ఆయన ఆధార్ కార్డును చూశారా..?

Prabhas : ప్రభాస్ అసలు పేరేంటో తెలుసా.. ఆయన ఆధార్ కార్డును చూశారా..?

Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఈ పేరు తెలియని వాళ్లు ఎవరూ ఉండరు. నాటి తరం హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో తన సత్తా చాటుతున్నాడు. బాహుబలి(Prabhas Real Name) తర్వాత ఆయన క్రేజ్ ఓ రేంజ్ లోకి వెళ్లిపోయింది. ఒకప్పడు తెలుగు సినిమా అంటే జాతీయ స్థాయిలో గుర్తింపు ఉండేది కాదు. బాక్సాఫీసు వద్ద వంద కోట్ల రూపాయల వసూళ్లు సాధించడమంటే చాలా కష్టం.

do-you-know-prabhas-real-name

అలాంటి పరిస్థితిని పూర్తిగా మార్చేస్తూ నేటి టాలీవుడ్ దర్శకులు, నటులు అంతర్జాతీయ స్థాయి కలలు కనే ధైర్యం తెచ్చిపెట్టిన చిత్రం బాహుబలి. ఆ సినిమా సక్సెస్ కోసం కేరీర్ లో అతి ముఖ్యమైన అయిదేళ్లను బాహుబలి చిత్రానికి అంకితం చేసి తెలుగుపరిశ్రమ గుర్తింపుని బాక్సాఫీస్ రూపు రేఖలని మార్చేశారు ప్రభాస్. ఒకప్పుడు కృష్ణుడు, రాముడు అనగానే టక్కున ఎన్టీఆరే గుర్తొచ్చేవారు. ఆయన ఆహార్యం తెరపై అలా ఉండేది మరి.

ఆ తర్వాత ఆరడుగుల ఎత్తు, గంభీరమైన స్వరం, కండలు తిరిగిన దేహంతో ఠీవిగా నడిచి వస్తుంటే, రాజంటే ఇలా ఉండాలి అని ప్రభాస్ ను చూస్తే అనిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 2000 కోట్ల కలెక్షన్ సాధించి.. కోట్లాది హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ప్రభాస్ కటౌట్ మైనపు ప్రతిమను బ్యాంకాక్‌లో మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ప్రతిష్టించారు. అంతటి గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ కు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకునేందుకు ఆయన అభిమానులు ఎంతో ఉత్సుకత చూపిస్తున్నారు.

అంతేకాకుండా నిరంతరం అతడిని ఆసక్తిగా ఫాలో అవుతూ ఉన్నారు. తాజాగా ఈయనకు సంబంధించిన ఆధార్ కార్డ్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో ప్రభాస్(Prabhas Real Name) అసలు పేరు చూసిన జనాలు అవాక్కవుతున్నారు. ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇక ప్రభాస్ ఆధార్ నెంబర్ 5986 6623 9932. ఇందులో ప్రభాస్ పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ అని ఉంది. తన పుట్టిన తేది 23/10/1979గా ప్రింట్ అయి ఉంది.

దీంతో ఆయన ఫ్యాన్స్ ఈ ఆధార్ కార్డును తెగ షేర్ చేసేస్తున్నారు. ‘బాహుబలి’ సిరీస్‌తో పాన్ ఇండియా లెవల్లో అదరగొట్టిన ప్రభాస్.. ఇటీవల ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ సినిమా అనుకున్నంత రేంజ్‌లో ఆడలేదు. దీంతో ప్రభాస్ తన తరువాత సినిమా ఎలాగైన హిట్ కొట్టాలన్న కసి మీద ఉన్నారు. నిజానికి సెప్టెంబర్ నెలాఖరులో సినిమా విడుదల చేయాలని భావించారు చిత్ర మేకర్స్. కానీ అనివార్య కారణాల వల్ల ఈ చిత్రం పోస్ట్ పోన్ అయింది.

Exit mobile version