Home Cinema Mahesh Babu : మహేష్ – రాజమౌళి చిత్రం వెనక్కి.. ‘గుంటూరు కారం’ తర్వాత ...

Mahesh Babu : మహేష్ – రాజమౌళి చిత్రం వెనక్కి.. ‘గుంటూరు కారం’ తర్వాత ఆ స్టార్ డైరెక్టర్ తో సినిమా చెయ్యబోతున్న మహేష్..

Mahesh Babu : టాలీవుడ్ లో టాక్ తో సంబంధం లేకుండా సినిమాకి కలెక్షన్స్ ని రప్పించగలిగే ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోలలో ఒకడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈమధ్య ఆయన సినిమాలకు నెగటివ్ టాక్ వచ్చినా కూడా వంద కోట్ల రూపాయిల షేర్ మార్కుని అవలీలగా అందుకుంటున్నాయి. అలంటి స్టార్ స్టేటస్ ఉన్న మహేష్ బాబు(Mahesh Babu Rajamouli), రాజమౌళి లాంటి డైరెక్టర్ తో చేస్తే చూడాలని అభిమానుల కోరిక ఎప్పటి నుండో ఉంది. పదేళ్ల క్రితమే ఈ కాంబినేషన్ ఖరారు అయ్యింది.

mahesh-babu-rajamouli-film-got-delayed-as-after-guntur-kaaram-mahesh-is-doing-movie-with-this-director

కానీ ఇద్దరు ఎవరి ప్రాజెక్ట్స్ లో వాళ్ళు బిజీ గా ఉండడం వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు రాజమౌళి #RRR చిత్రం తర్వాత మహేష్ బాబు తో సినిమా చేస్తున్నాను అని అధికారిక ప్రకటన చెయ్యడం తో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ #RRR చిత్రం విడుదలై ఏడాది దాటింది. ఇప్పటి వరకు ఈ కాంబినేషన్ సినిమా కనీసం పూజ కార్యక్రమాలను కూడా జరుపుకోలేదు. ఇంకా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది అంటూ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ పలు ఇంటర్వ్యూస్ లో తెలిపాడు.

రీసెంట్ గా కొంతభాగం స్క్రిప్ట్ వర్క్ ని పూర్తి చేసుకోగా, పెద్దగా నచ్చని కారణం గా మళ్ళీ కొన్ని మార్పులు చేర్పులు చెయ్యాలని రాజమౌళి సూచించాడట. దీంతో షూటింగ్ ప్రారంభం అవ్వడానికి మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉండడంతో రాజమౌళి మహేష్ ఈలోపు మరో సినిమా చేసుకునే ఉద్దేశ్యం ఉంటే చేసుకో అని అనుమతి ఇచ్చాడట. దీంతో మహేష్ బాబు అనిల్ రావిపూడి ని పిలిచి వెంటనే ఈ నీ దగ్గర ఉన్న సబ్జెక్టు కి తుది మెరుగులు దిద్ది, ఫైనల్ స్క్రిప్ట్ ని తీసుకొని రా అని అన్నాడట.

ప్రస్తుతం ‘గుంటూరు కారం’ చిత్రం చేస్తున్న మహేష్ బాబు , ఈ సినిమా పూర్తి అవ్వగానే అనిల్ రావిపూడి తో సినిమా ప్రారంభిస్తాడని తెలుస్తుంది. గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రం వచ్చింది. ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది, సుమారుగా 130 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.

ఆ సినిమా తర్వాత మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ లో మరో చిత్రం రాబోతుంది అనడం ఫ్యాన్స్ కి సంతోషమే, వచ్చే ఏడాది లో ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. రాజమౌళి చిత్రం వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో ప్రారంభం అయ్యే ఛాన్స్(Mahesh Babu Rajamouli ).

Exit mobile version