Home Cinema Manchu Manoj : తన కూతురికి ఆ స్టార్ హీరోయిన్ పేరు పెట్టిన మంచు మనోజ్.....

Manchu Manoj : తన కూతురికి ఆ స్టార్ హీరోయిన్ పేరు పెట్టిన మంచు మనోజ్.. బారసాల ఫోటోలు వైరల్..

Manchu Manoj : టాలీవుడ్ హీరో మంచు మనోజ్ దంపతులు ఇటీవల తల్లితండ్రులు అయిన సంగతి తెలిసిందే. మనోజ్ భార్య భూమా మునికా రెడ్డి ఏప్రిల్‌లో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే తాజాగా మంచు కుటుంబ సభ్యులతో కలిసి బారసాల వేడుకను నిర్వహించారు. ఇక మంచు మనోజ్ తన కూతురు పేరును సోషల్ మీడియాలో ప్రకటించాడు. మనోజ్-మౌనిక దంపతులు తమ ఆడబిడ్డకు దేవసేన శోభ ఎంఎం అని పేరు పెట్టారు. దీనిపై మనోజ్ వివరణ ఇస్తూ ప్రత్యేక పోస్ట్ రాశారు.

మీ ఆశీస్సులతో మా పాప దేవసేన శోభ ఎంఎంను ఈ లోకానికి పరిచయం చేస్తున్నాము. శ్శివ భక్తులమైన మేము మా బిడ్డకు ఈ శివుని కుటుంబం నుండి ఒక్కరైనా సుబ్రహ్మణ్యస్వామి భార్య పేరు దేవసేన అని పెట్టాము. చెప్పాలంటే, శోభ అనే పేరు నా దివంగత అత్తగారు శోభా నాగిరెడ్డి నుండి వచ్చింది. మీ దీవెనలు మా కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటాయి. మంచు మనోజ్ తన కూతురు పేరు ప్రకటించి కొని ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు.

Manchu Manoj Daughter Name

ఇదిలా ఉంటే, దర్శకధీరుడు రాజమౌళి బాహుబలిలో అనుష్క శెట్టి పాత్ర కూడా దేవసేన పేరుతోనే సాగుతుంది. ఇప్పుడు మంచు మనోజ్ తన కూతురికి అదే పేరు పెట్టాడు అంటూ ఇంటర్నెట్ అందరు అంటున్నారు. ఈ ఫంక్షన్ కు మంచు కుటుంబంతో పాటు భూమా వారి కుటుంబసభ్యులు కూడా హాజరయ్యారు. ఇకపోతే సినిమా ఇండస్ట్రీ నుండి ఈ ఫంక్షన్ కు ఎవ్వరు హాజరవలేదు. ఇప్పుడు ఈ వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Exit mobile version