Home Cinema Janhvi Kapoor : జాన్వీ ధరించిన ఈ నెక్లెస్ ధర ఎంతో తెలిస్తే మతిపోతది.. పెద్ద...

Janhvi Kapoor : జాన్వీ ధరించిన ఈ నెక్లెస్ ధర ఎంతో తెలిస్తే మతిపోతది.. పెద్ద ఇల్లు కట్టొచ్చు..

Janhvi Kapoor : నటి శ్రీదేవి కుమార్తె బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం కెరీర్‌లో పీక్ స్టేజిని ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ఇటు నార్త్ మరియు అటు సౌత్ సినిమా ఇండస్ట్రీలోనూ బిజీ బిజీగా ఉంది. అయితే జాన్వీ కపూర్ ఇటీవల అంబానీ ఇంట్లో జరిగిన వివాహ వేడుకలో తళ్లుకున్న మెరిసింది. రిలయన్స్ అధినేత అపర కుబేరుడు ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ తన ప్రేయసి రాధిక మర్చంట్‌తో పెళ్లికి సిద్ధమైన సంగతి తెలిసిందే.

జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న ఆనంద్ – రాధిక వివాహ వేడుక చిరస్మరణీయం. అయితే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మాత్రం జోరుగా సాగుతున్నాయి. ఈ వేడుకలకు దేశ, విదేశాల నుంచి అతిరథి మహారథులు వస్తుంటారు. చాలా మంది ప్రపంచ ప్రసిద్ధ వ్యక్తులు కనిపిస్తారు. ఇటీవలే ముంబైలోని యాంటిలియాలో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ ల మమేరు వేడుకను గుజరాతీ సంప్రదాయంలో ఘనంగా నిర్వహించారు.

janhvi-necklace-price-which-she-wore-for-ambani-pre-wedding-function-will-blow-your-mind

జాన్వీ కపూర్ కూడా హాజరయ్యారు. ఆమె మెడలో, ఆమె దుస్తులకు సరిపోయే అందమైన హారాన్ని ధరించింది. అయితే ఇప్పుడు ఈ నెక్లెస్ ధర హాట్ టాపిక్ గా మారింది. పెద్ద పెద్ద రాళ్లతో ఎంతో ఆకర్షణీయంగా కనిపించే ఈ నెక్లెస్ హజారీ లాల్ లెగసీ జ్యువెలరీ బ్రాండ్‌కు చెందినది. ఈ నెక్లెస్ ధర ఎంతో అంటే, అక్షరాలా 52 లక్షలు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు బిత్తరపోతున్నారు. సాధారణ మనిషి విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేయగలడని ఈ డబ్బు సరిపోతుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version