Home Cinema Lavanya Tripathi : లావణ్య త్రిపాఠి తో రొమాన్స్ చెయ్యడానికి ఇబ్బంది పడ్డ స్టార్ హీరో...

Lavanya Tripathi : లావణ్య త్రిపాఠి తో రొమాన్స్ చెయ్యడానికి ఇబ్బంది పడ్డ స్టార్ హీరో అతనేనా!

Lavanya Tripathi : గత కొంత కాలం నుండి ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి పేరు సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో వినిపిస్తుందో మన అందరికీ తెలిసిందే. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ తో ఎంతో కాలం నుండి ప్రేమాయణం నడిపి, రీసెంట్ గానే నిశ్చితార్థం చేసుకున్నారు. అతి త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఈ విషయం తెలిసినప్పటి నుండి సోషల్ మీడియా లో లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi Manchu Vishnu) పేరు మారుమోగిపోయింది.

manchu-vishnu-felt-uncomfortable-romancing-lavanya-tripathi

ఎక్కడ చూసినా వీళ్లిద్దరి నిశ్చితార్థం కి సంబంధించిన ఫొటోలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీళ్లిద్దరు కలిసి గతం లో ‘మిస్టర్’ మరియు ‘అంతరిక్షం‘ వంటి చిత్రాల్లో నటించారు. మిస్టర్ చిత్రం తో స్నేహితులైన వీళ్లిద్దరు, అంతరిక్షం సినిమా సమయం లో ప్రేమించుకోవడం మొదలు పెట్టారు. ఆ తర్వాత డేటింగ్ చేసుకొని, ఇంట్లో వాళ్ళని ఒప్పించి నేడు నిశ్చితార్థం చేసుకున్నాడు. డిసెంబర్ నెలలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు.

ఇది ఇలా ఉండగా లావణ్య త్రిపాఠి గురించి రీసెంట్ గా మంచు విష్ణు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో దూసుకెళ్తా అనే సినిమా వచ్చింది. ఈ చిత్రం అప్పట్లో మంచి టాక్ ని తెచ్చుకొని కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది. ఇందులో ఒక సాంగ్ లో లావణ్య త్రిపాఠి తో బాగా రొమాన్స్ చెయ్యాల్సిన పరిస్థితి వచ్చిందట. లావణ్య త్రిపాఠి కి రొమాన్స్ చెయ్యడానికి సుముఖంగానే ఉన్నా, మంచు విష్ణు చాలా ఇబ్బంది పడ్డాడట, ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే చెప్పుకొచ్చాడు.

లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi Manchu Vishnu) కూడా ఇన్ని రోజులు ఎక్కువగా అందాల ఆరబోతకు స్కోప్ ఉండే పాత్రలు చెయ్యలేదు. కేవలం నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేస్తూ వచ్చింది. ఇంత చక్కగా ఉన్న అమ్మాయి కాబట్టే మెగా ఫ్యామిలీ కుటుంబీకులు ఈమెని తమ కుటుంబం లో చేర్చుకోవడానికి ఇష్టపడ్డారు.

వరుణ్ తేజ్ కూడా లావణ్య త్రిపాఠి తన భార్య అవుతున్నందుకు ఎంతో లక్కీ గా ఫీల్ అవుతున్నాడు. ఇకపోతే పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి సినిమాల్లో నటిస్తుందో లేదో అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ఈమె తనల్ అనే తమిళ సినిమాలో హీరోయిన్ గా నటించింది. షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని జరుపుకుంటుంది.

Exit mobile version