Home Cinema Manmadhudu Movie : మన్మధుడు లాంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న స్టార్ హీరో...

Manmadhudu Movie : మన్మధుడు లాంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరంటే..?

Manmadhudu Movie : అక్కినేని కుటుంబం నుండి తెలుగు ఇండస్ట్రీలోకి హీరోలు బోలెడంత మంది వచ్చారు. అయితే మొదటి తరం హీరోగా నాగేశ్వర రావు కుమారుడు అక్కినేని నాగార్జున (Nagarjuna Manmadhudu Hero Tarun) వెండి తెరకు పరిచయం అయ్యాడు. నాగార్జున తన మొదటి చిత్రం శివ తోనే బారి విజయం అందుకున్నాడు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది మరియు యువత అంతా అక్కినేని నాగార్జునకు పెద్ద ఫాన్స్ అయిపోయారు.

manmadhudu-story-is-written-for-hero-tarun-and-then-went-to-nagarjuna-says-trivikram

ఆయన ఈ సినిమా తరువాత తెలుగు ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోయాడు. అక్కినేని నాగార్జున కెరీర్ లో మన్మధుడు అనే సినిమా మర్చిపోలేని సినిమాలో ఒకటి అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాను కే. విజయ్ భాస్కర్ తెరకెక్కించారు. నాగార్జున సరసన మన్మధుడు సినిమాలో సోనాలి బింద్రే నటించారు మరియు వీరిద్దరి కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ పై బాగా వర్కౌట్ అయ్యింది. తనికెళ్ళ భరణి, చంద్ర మోహన్ మరియు రంగనాథ్ తదితరులు ముఖ్య పాత్రలో నటించి మెప్పించారు.

ఈ సినిమాకు స్వరాలూ అందించింది రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్. ఈ మ్యూజిక్ ఆల్బం బారి విజయాన్ని అందుకుంది మరియు అప్పట్లో యువతకు బాగా నచ్చింది అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మించి నటించాడు. అప్పట్లో మన్మధుడు సినిమాకు మాటలు మరియు కథ త్రివిక్రమ్ రచించాడు. ఈ సినిమా 2002 లో విడుదలై ఫ్యామిలీస్ మరియు యువత ఇద్దరినీ ఆకట్టుకొని బారి విజయం సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దుమారం లేపింది.

ఈ సినిమాకు హైలైట్ గా బ్రహ్మానందం మరియు సునీల్ కామెడీ అని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటె ఇపుడు ఓ వార్తా వైరల్ అవుతుంది. అదేంటంటే, మన్మధుడు సినిమా అసలు నాగార్జునకు కాదు వెళ్ళలిసింది అని సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. ఈ సినిమా స్టోరీ రాసిన త్రివిక్రమ్ అప్పట్లో తాను దర్శకత్వం వహించాలని కోరికతో ఓ రెండు స్టోరీలు రాసుకున్నారట. అవేంటంటే.. నువ్వే నువ్వే మరియు మన్మధుడు స్టోరీలే అంట. ఈ సినిమాలు రెండు లవర్ బాయ్ తరుణ్ కోసం రాసుకున్నాడంట.

అయితే దర్శకుడు విజయ్ భాస్కర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో నువ్వే కావాలి అనే సినిమా చేసారు మరియు ఇది బారి విజయం సాధించింది. అయితే ఆయన ఇంకో స్టోరీ రాయమని త్రివిక్రమ్ ను అడగగా ఆయన మన్మధుడు స్టోరీ ఆయనకు ఇచ్చేశారట. విజయ్ భాస్కర్ అలా ఆ స్టోరీని అక్కినేని నాగార్జున (Nagarjuna Manmadhudu Hero Tarun) కు చెప్పగా ఆయన ఇట్టే ఓకే చేశారట. అలా తరుణ్ చేయాలిసిన సినిమా నాగార్జున చేసి బారి విజయం అందుకున్నాడు.

Exit mobile version