Home Cinema Mahesh Babu : చీటింగ్ కేసు నమోదు అవ్వడం తో చిక్కుల్లో పడ్డ సూపర్ స్టార్...

Mahesh Babu : చీటింగ్ కేసు నమోదు అవ్వడం తో చిక్కుల్లో పడ్డ సూపర్ స్టార్ మహేష్ బాబు..

Mahesh Babu Cheating Case : మన టాలీవుడ్ స్టార్ హీరోలు ఒక పక్క సినిమాలు చేసుకుంటూ మరో పక్క కమర్షియల్ యాడ్స్ చేస్తూ చేతినిండా డబ్బులు సంపాదిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం మన టాలీవుడ్ లో అత్యధిక కమర్షియల్ యాడ్స్ చేస్తున్న హీరో ఎవరు అంటే, ప్రతీ ఒక్కరూ కళ్ళు మూసుకొని చెప్పే పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు. సినిమాల్లో కంటే కూడా ఈయన యాడ్స్ ద్వారా సంపాదించిన డబ్బులే ఎక్కువ, రీసెంట్ గా ఆయన కూతురు సితార కూడా యాడ్స్ చెయ్యడం మొదలు పెట్టింది.

mahesh-babu-cheating-case

ఇదంతా పక్కన పెడితే మహేష్ బాబు రీసెంట్ గా సూర్య డెవలపర్స్ అనే ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థకి ప్రచారకర్త గా వ్యవహరించేందుకు ఒప్పుకున్నాడు. రీసెంట్ గానే ఈ సంస్థ కి ఒక యాడ్ కూడా చేసి పెట్టాడు. అయితే ఈ సంస్థ పై ఇప్పుడు ఒక చీటింగ్ కేసు నమోదు అయ్యింది, ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనం గా మారింది (Mahesh Babu Cheating Case). ఇక అసలు విషయానికి వస్తే శ్రీ సాయి సూర్య డెవలపర్స్ సంస్థ హైదరాబాద్ లోని వెంగళరావు నగర్ కేంద్రంగా వ్యాపారం చేస్తుంది. అయితే రీసెంట్ గా ఈ కంపెనీ చీటింగ్ చేస్తుంది అంటూ విష్ణు వర్ధన్ అనే కస్టమర్ చీటింగ్ కేసు నమోదు చేసాడు.

వివరాల్లోకి వెళ్తే 2021 వ సంవత్సరం ఏప్రిల్ నెలలో విష్ణు వర్ధన్ అనే వ్యక్తి షాద్ నగర్ లో 14 ఎకరాల భూమిని తన స్నేహితులతో కలిసి పెట్టుబడులు పెట్టాడు . వ్యవసాయత్ర భూమి విషయం లో ఈ కంపెనీ తరుపున పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. పెట్టుబడులు పెట్టిన వెంటనే రిజిస్ట్రేషన్ చేయిస్తామని కంపెనీ హామీ ఇచ్చిందట, కానీ ఎన్నేళ్లు గడిచిన వాళ్ళ నుండి ఎలాంటి సమాచారం రాకపోవడం తో విష్ణు వర్ధన్ కి అనుమానం మొదలైంది. ఆ తర్వాత ఆయన వ్యక్తిగతంగా విచారణ చేపట్టగా, అప్పటికే ఆ భూమి ఎస్వీఆర్ వెంకటేష్ కంపెనీ పేర్ల మీద రిజిస్టర్ అయ్యిందట.

దీంతో శ్రీ సాయి సూర్య కంపెనీ అధినేత సతీష్ చంద్ర గుప్త పై సెక్షన్ 406, 420 క్రింద ఆర్ధిక అవకతవకలకు పాల్పడినట్టుగా కేసుని నమోదు చేసారు. అయితే ఇలాంటి మోసాలకు పాల్పడే కంపెనీ యాడ్స్ చేసినందుకు మహేష్ బాబు కూడా చిక్కులో పడ్డాడు. ఒక సూపర్ స్టార్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక యాడ్ చేసేటప్పుడు ముందు వెనుక చూసుకోరా అంటూ మహేష్ బాబు పై మండిపడుతున్నారు నెటిజెన్స్.

Exit mobile version