Home Cinema బంపర్ ఆఫర్ కొట్టేసిన మీనాక్షి చౌదరి.. స్టార్ హీరో సరసన నటిస్తుంది..

బంపర్ ఆఫర్ కొట్టేసిన మీనాక్షి చౌదరి.. స్టార్ హీరో సరసన నటిస్తుంది..

నటి మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల ఈ భామ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో నటించి అందరిని మెప్పించింది. మీనాక్షి చౌదరి ఇచట వాహనములు నిలపరాదు సినిమా ద్వారా వెండితెరకు పరిచమైనది. ఈ సినిమాతో మీనాక్షికి అంత గుర్తింపు రాలేదు. ఈ భామ అడపాదడపా సినిమాలు చేసుకుంటూ వచ్చింది. కానీ ఈమెకు బ్రేక్ ఇచ్చిన చిత్రం అంటే గుంటూరు కారం సినిమానే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ భామ ఇటీవల సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటుంది.

తన అందచెందాలను ఆరబోస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించింది. ఈమె అందానికి యువత ఫిదా అయ్యారు. ప్రస్తుతం మీనాక్షి చేతిలో సూపర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మీనాక్షి తమిళ స్టార్ విజయ్ తో కలిసి నటించబోతుంది. ది గ్రేటెస్ట్ అఫ్ అల్ టైం అని ఈ ప్రాజెక్ట్ టైటిల్ కూడా విడుదల చేసారు ఈ చిత్ర యూనిట్. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా మీనాక్షి నటిస్తుంది. ఈ భామ సైన్ చేసిన మరో సినిమా దుల్కర్ సల్మాన్ సరసన లక్కీ భాస్కర్ అనే సినిమాలో నటిస్తుంది.

meenakshi-chaudhary-next-film-with-star-hero

అయితే ప్రస్తుతం ఈ భామ మరో బంపర్ ఆఫర్ను కొట్టేసింది అంటూ ఓ వార్తా వైరల్ గా మారింది. అందేంటంటే, విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి కలిసి చేస్తున్న సినిమా ఈ సంక్రాతి కి అనౌన్స్ అయినా విషయం మన అందరికి తెలిసినదే. ఈ సినిమాలో వెంకీ మామ సరసన మీనాక్షి హీరోయిన్ గా నటిస్తుందట. దీనిపై కొద్దీ రోజులో అధికారిక ప్రకటన వస్తుంది అని సమాచారం. ఏదిఏమయిన ఈమె నటించే సినిమాలు మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నారు ఈమె ఫాలోవర్స్.

Exit mobile version