Home Cinema Klin Kaara : చాల ఓవర్ చేస్తున్న మెగా ఫామిలీ.. క్లిన్ కార ను చూడాలంటే...

Klin Kaara : చాల ఓవర్ చేస్తున్న మెగా ఫామిలీ.. క్లిన్ కార ను చూడాలంటే ఇన్ని కండిషన్ ఆ..

Klin Kaara : అన్యోన్య దాంపత్యానికి నిదర్శనంగా నిలిచినా ఆదర్శ దంపతుల లిస్ట్ తీస్తే అందులో రామ్ చరణ్ మరియు ఉపాసన జంట ముందు వరుసలో ఉంటుంది. పెళ్ళై 11 ఏళ్ళు పూర్తి కావొస్తున్నా కూడా మొన్నటి వరకు పిల్లలు లేకపోయినప్పటికీ ఎలాంటి గొడవలు లేకుండా ఏకాభిప్రాయం తో ఇన్ని రోజులు కొనసాగించిన దాంపత్య జీవితం వీళ్ళిద్దరిదీ. చిన్న చిన్న సిల్లీ కారణాలతో విడిపోయేవారు ఒక్కసారి రామ్ చరణ్ – ఉపాసన జంటని చూసి ఆదర్శంగా తీసుకుంటే అసలు విడాకులు అనే మాట కూడా తమ మనసులోకి రానివ్వరని అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

mega-family-klin-kaara

ఇక రీసెంట్ గానే వీళ్లిద్దరు ఒక పాపకి జన్మనిచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ పాపకి ‘క్లిన్ కారా'(Klin Kaara) అని పేరు పెట్టారు. వాస్తవానికి ఈ పేరు ని ఉపాసన వాళ్ళ అమ్మ ఉపాసనకు పెట్టాలి అనుకున్న పేరట. కానీ చివరికి తన మనవరాలికి ఆ పేరు ఫిక్స్ అయ్యింది. ఇది ఇలా ఉండగా రామ్ చరణ్ – ఉపాసన దంపతులు క్లిన్ కార పాప ని ఒక గాజు బొమ్మలాగా చూసుకుంటున్నారట. ఎవరు ఆ బుడ్డి పాపని ముట్టుకోవడానికి అంగీకరించడం లేదట. ఆమె కోసం ఒక ప్రత్యేకమైన రూమ్ కేటాయించి అందులో ఒక ఊయలలో పడుకోబెట్టారట.

చివరికి చిరంజీవి మనవరాళ్లు కూడా ముట్టుకోవడానికి వీలు లేకుండా చేశారట. ఇక ఇండస్ట్రీ లో ‘క్లిన్ కారా’ పుట్టగానే ఒక్కసారి ఆ చిన్నారిని చూసేందుకు టాలీవుడ్ సెలెబ్రిటీలు మొత్తం ఎంతో ఆసక్తి చూపారట. అయితే క్లిన్ కారా ని చూసేందుకు ఆ సెలెబ్రెటీలకు కూడా చాలా ఆంక్షలు పెడుతున్నట్టు సమాచారం. ఆమెని చూసేందుకు వచ్చేటప్పుడు మొబైల్ ఫోన్లు తీసుకొని రాకూడదు అట. ఎందుకంటే పొరపాటున ఫోటోలు తీసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తే పాపకి దిష్టి తగులుతుందని ఆ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

అంతే కాదు ఆ పాపని ఎత్తుకొని ఆడించడానికి కూడా లేదట, చిన్న పసిబిడ్డ కాబట్టి ముట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉందని ఈ నిర్ణయం తీసుకున్నారట. ఉపాసన మరియు రామ్ చరణ్ పెట్టిన ఈ ఆంక్షలు విని కొంతమంది సెలెబ్రిటీలు హర్ట్ అయ్యినట్టుగా కూడా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మెగా కుటుంబీకులు కూడా క్లిన్ కారా ని ఎక్కువగా ముట్టుకోనివ్వడం లేదట ఉపాసన. దీనితో నెటిజెన్స్ సోషల్ మీడియా లో వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version