Home Cinema Lavanya Tripathi : లావణ్య త్రిపాఠిని ట్రోల్ల్స్ చేస్తున్న మెగా అభిమానులు.. కారణం అదేనా..

Lavanya Tripathi : లావణ్య త్రిపాఠిని ట్రోల్ల్స్ చేస్తున్న మెగా అభిమానులు.. కారణం అదేనా..

Lavanya Tripathi : ఇదే వార్త ఇప్పుడు సోషల్ నెట్‌వర్క్‌లలో ట్రెండ్ అవుతుంది. లావణ్య త్రిపాఠిను మెగా అభిమానులు బారి టోల్యింగ్ చేస్తున్నారు. ఎప్పుడూ తనదైన శైలిలో ఇండస్ట్రీలో నటిస్తూ తన సత్తా చాటుకుంటుంది లావణ్య త్రిపాఠి. ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటుంది. ఈ అందాల భామకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. అయితే ఎప్పుడూలేని విదంగా తొలిసారి పెద్ద ఎత్తున ట్రోల్ చేయబడింది లావణ్య. దీనికి కారణం ఏంటో మనం ఇపుడు ఇక్కడ తెలుసుకుందాం.

ఆంధ్రలో ప్రస్తుతం ఎన్నికల జరుగుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి ఇది రెండో ఎలక్షన్ అని మన అందరికి తెలిసినదే. అయితే పిఠాపురం సౌత్ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకోసం పలు ప్రమోషన్స్‌లో పాల్గొన్నాడు. పవన్ కళ్యాణ్ కచ్చితంగా గెలుస్తారని ధీమాగా ఉన్నారు. అంతేకాదు మెగా ఫ్యామిలీకి చెందిన మహిళలు మరియు హీరోలు కూడా పవన్ కళ్యాణ్ గెలవాలని ప్రచారం చేశారు.

mega-fans-trolling-lavanya-tripathi

లావణ్య దీని గురించి ఎలాంటి పోస్ట్‌ను షేర్ చేయలేదు. లావణ్య ఇటీవల తన అత్తగారుతో కలిసి ఆవకాయ సిద్ధం చేస్తున్న ఫోటోను షేర్ చేసింది. దీంతో ఈమెపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఎన్నికలలో పోటీ చేస్తుంటే మెగా ఫ్యామిలీలో అందరు ఆయనకు ఓటు వేయమని వీడియో బైట్స్ లేదా ట్వీట్లు పెడుతుంటే మీరు మాత్రం ఆవకాయ్ పచ్చడి అది ఇది అంటూ సోది పోస్ట్లు పెట్టె బదులు ఆయనకు సపోర్ట్ చేస్తూ పెట్టొచ్చు కదా అని మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version