Home Cinema Chiranjeevi: పుష్ప 2 సినిమాలో చిరంజీవి.. ఆ పాత్రకు కంఫర్మ్ చేసిన సుకుమార్..

Chiranjeevi: పుష్ప 2 సినిమాలో చిరంజీవి.. ఆ పాత్రకు కంఫర్మ్ చేసిన సుకుమార్..

Chiranjeevi: పుష్ప సినిమా హిట్ తరువాత అల్లు అర్జున్ పేరు దేశం మొత్తం మారుమోగిపోయింది. డైరెక్టర్ సుకుమార్ సినీ కెరీర్ లోనే అతి పెద్ద హిట్ గా నిలిచింది పుష్ప సినిమా, ఈ సినిమా తో సుకుమార్ కు ఎప్పుడు చూడనంత డబ్బు వచ్చి పడింది ఎంత అంటే ఇన్కమ్ టాక్స్ వాళ్ళు రైడ్ చేసే అంత. సుకుమార్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూట్ లో చాలా బిజీగా ఉన్నాడు(Chiranjeevi In Pushpa 2). ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కు సిద్ధం అవుతుంది. పుష్ప 2 సినిమా కోసం ఫాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

allu-arjun-pushpa-2

మొన్ననే అల్లు అర్జున్ పుష్ప సినిమా లో తన గొప్ప నటనకు నటినల్ అవార్డు ప్రెసిడెంట్ చేతుల మీదగా అందుకున్నాడు. 61 ఏళ్ళ తరువాత నేషనల్ అవార్డు అందుకున్న తెలుగు నటుడు అల్లు అర్జున్. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 లో తన షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుని డబ్బింగ్ చెపుతున్నాడు. ప్రస్తుతం పుష్ప 2 సినిమా కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. అదేంటి అంటే పుష్ప 2 సినిమా లో మెగాస్టార్ చిరంజీవి ఉండబోతున్నాడా..?

పుష్ప 1 సమయం నుండే చిరంజీవి పుష్ప సినిమాలో ఉండబోతున్నాడు అని టాక్ ఉంది, ఇప్పుడు అది నిజం కానుంది(Chiranjeevi In Pushpa 2). సినిమా లో అల్లు అర్జున్ చిరంజీవి ఫ్యాన్ గా ఉండబోతున్నాడు అట. చిరజీవి కొన్ని పాత సినిమా డైలాగ్ లతో పాటు చిరంజీవి సూపర్ హిట్ సినిమా పాటలను రీమిక్స్ చేయబోతున్నారు అని టాక్. అంతే కాకుండా చిరంజీవి స్టెప్పులను తన స్టైల్ లో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో చేయబోతున్నాడు అని తెలుస్తుంది.

పుష్ప 2 సినిమాలో శ్రీవల్లి చిరంజీవి సినిమాకు వెళుతుంది, ఈ సారి ఫ్రెండ్స్ తో కాదు భర్త పుష్ప రాజ్ తో. ఈ విధం గా చిరంజీవిని పుష్ప సినిమా లోకి రప్పించి ఫాన్స్ కు మరింత క్రేజ్ ని ఇవ్వనున్నాడు డైరెక్టర్ సుకుమార్. ఇంకా స్పెషల్ ఏంటి అంటే పుష్ప 2 సినిమాలో సాయి పల్లవి కూడా నటించబోతుంది. మొదటి పార్టీ లోనే ఉండాల్సిన సాయి పల్లవి తన డేట్ కుదరక చేయలేకపోయింది. పుష్ప 2 లో తన పాత్ర పై ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు.

పుష్ప 2 ను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు సినిమా బృందం, అల్లు అర్జున్ ఫాన్స్ మాత్రం ఈ ఏడాది ఎటువంటి సినిమాలు లేక చాల నిరాశతో ఉన్నారు. ఇక సంక్రాంతి కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

Exit mobile version