Home Cinema Mirna Menon: జైలర్ సినిమాలో రజినీకాంత్ కోడలిగా నటించిన ఈ అమ్మాయి బ్యాగ్రవుండ్ ఇదే..

Mirna Menon: జైలర్ సినిమాలో రజినీకాంత్ కోడలిగా నటించిన ఈ అమ్మాయి బ్యాగ్రవుండ్ ఇదే..

Mirna Menon: రీసెంట్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటించిన ‘జైలర్’ చిత్రం గ్రాండ్ గా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను నమోదు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న సంగతి అందరికీ తెలిసిందే. చాలా కాలం నుండి రజిని కి సరైన సక్సెస్ రావాలని కోరుకుంటున్న ఆయన ఫ్యాన్స్ కి ఈ సినిమా ఇచ్చిన కిక్ మామూలుది కాదు. కేవలం వారం రోజుల లోపే ఎంతో మంది సౌత్ ఇండియన్ స్టార్ హీరోల కెరీర్ హైయెస్ట్ క్లోసింగ్ కలెక్షన్స్ ని అవలీల గా దాటేశాడు. 70 ఏళ్ళ వయస్సు లో కూడా ఇలాంటి స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్న ఏకైక హీరో గా రజినీకాంత్ ఇండియా లో కొనసాగుతున్నాడు.

mirna-menon-jailer

అందుకే ఆయనని ఇండియా కి ఒక్కడే సూపర్ స్టార్, అది రజినీకాంత్ మాత్రమే అని ట్రేడ్ పండితులు అంటుంటారు. ఇకపోతే ఈ సినిమాలో రజినీకాంత్ తర్వాత కొంతమంది నటీనటులకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. వారిలో ముఖ్యంగా మనం రజినీకాంత్ కోడలిగా నటించిన ఈ అమ్మాయి గురించి మాట్లాడుకోవాలి. చూడచక్కని అందం తో, చక్కటి అభినయం తో ఈమె ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. సినిమా చూసొచ్చిన ప్రేక్షకులు అసలు ఎవరీ అమ్మాయి, ఇంతకు ముందు ఏమైనా సినిమాల్లో నటించిందా అని గూగుల్ లో వెతకడం ప్రారంభించారు.

అప్పుడు ఈమె పేరు అదితి మీనన్ అని, సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆమె తన పేరుని మిర్న మీనన్(Mirna Menon) గా మార్చుకుంది అని తెలుస్తుంది. ఈమె కేరళకి చెందిన అమ్మాయి, ఈమె 2016 వ సంవత్సరం లో ‘పట్టాదారి’ అనే తమిళ సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఇక ఆ తర్వాత కొన్నాళ్ళకు ఈమె మోహన్ లాల్ తో కలిసి నటించిన ‘బిగ్ బ్రదర్’ చిత్రం ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. ఇక ఆ తర్వాత అల్లరి నరేష్ తో కలిసి ‘సిల్లీ ఫెలోస్’ మరియు ‘ఉగ్రం’ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

ఈ రెండు చిత్రాలు పెద్దగా సక్సెస్ కాలేదు కాబట్టి ఆమె పేరు గట్టిగా వినిపించలేదు. కానీ ఇప్పుడు జైలర్ చిత్రం సంచలన విజయం సాధించి ఇండస్ట్రీ రికార్డ్స్ తో చెడుగుడు ఆదుకోవడం, ఆ చిత్రం లో అతి ముఖ్యమైన పాత్ర పోషించినందుకు మిర్న మీనన్ కి మంచి పేరు ప్రఖ్యాతలు రావడం తో ఇక నుండి ఈమె టైం మొదలైంది అనే చెప్పొచ్చు. జైలర్ సినిమా మాత్రం చాల మంచి కలెక్షన్స్ పొందింది. ఇప్పటి వరకు 500 కోట్లు పైగానే కలెక్షన్స్ వచ్చాయి ఈ సినిమాకి.

Exit mobile version