Home Cinema Mohan Babu: అక్కినేని నాగేశ్వర రావు పై నోరు జారిన మోహన్ బాబు.. మండిపడుతున్న నెటిజెన్స్..

Mohan Babu: అక్కినేని నాగేశ్వర రావు పై నోరు జారిన మోహన్ బాబు.. మండిపడుతున్న నెటిజెన్స్..

Mohan Babu: ఇండస్ట్రీ లో డబ్బా రాయుడు ఎవరు అనే పేరు తీస్తే అందరికీ గుర్తుకు వచ్చే పేరు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఇతను ఇండస్ట్రీ లో లెజండరీ నటుడే. చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ, ఆ తర్వాత విలన్ గా ఎన్నో వందల సినిమాల్లో నటించి, తర్వాత హీరో గా మారి భారీ సక్సెస్ లు అందుకొని కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్నాడు(Mohan Babu About Anr. అక్కడి వరకు అంతా బాగానే ఉంది, కానీ ఈయన ఎన్టీఆర్ మరియు ఎస్వీఆర్ తర్వాత టాలీవుడ్ లో నేనే గొప్ప నటుడిని అంటూ తనకి తానూ భజన చేసుకుంటూ ఉంటాడు. ఇతను కొట్టుకునే సెల్ఫ్ డబ్బా వల్ల ఆయన తోటి నటులతో ఎన్నోసార్లు గొడవలు ఏర్పడ్డాయి.

anr

ఆ గొడవల్లో నుండి అయినా ఏదైనా నేర్చుకొని మారుతాడేమో అని అనుకుంటే, ఇంకా పిచ్చి ముదిరినవాడిలాగా చేస్తాడు. అందుకే ఇతని మీద, ఇతని కుటుంబం మీద సోషల్ మీడియా లో ఎన్నో ట్రోల్ల్స్ మరియు మీమ్స్ వస్తుంటాయి. మహానటుడు అక్కినేని నాగేశ్వర రావు గారు బ్రతికి ఉన్న రోజుల్లో ANR నేషనల్ అవార్డ్స్ అనే ప్రోగ్రాం జరిగింది. ఈ ప్రోగ్రాం కి మోహన్ బాబు కూడా ఒక అతిథి గా హాజరయ్యాడు. ఈ ఫంక్షన్ లో మోహన్ బాబు నేను నాగేశ్వర రావు గారికంటే గొప్ప నటుడుని అని, ఇది ఆయన సతీమణి అన్నపూర్ణ గారు చెప్పారు అంటూ మాట్లాడి, ఆ తర్వాత నాగేశ్వర రావు గారి చేత అదే ఫంక్షన్ లో చివాట్లు పెట్టించుకున్నాడు(Mohan Babu About Anr.

ఇప్పుడు రీసెంట్ గా ANR వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ లో విగ్రహావిష్కరణ జరిగింది. ఈ ఈవెంట్ కి ఎంతో మంది ప్రముఖులు ముఖ్య అతిధులుగా విచ్చేసారు, వారిలో మోహన్ బాబు కూడా ఒకడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నేను అన్నపూర్ణ స్టూడియోస్ లో చాలా సినిమాలు చేశాను, అన్నపూర్ణ గారికి నా నటన అంటే ఎంతో ఇష్టం, నన్ను పొగిడినప్పుడల్లా నాగేశ్వర రావు వాడిని మరీ అంత లేపాను అని తిట్టేవారు. ఆయన షూటింగ్ కి వచ్చినప్పుడల్లా లేచి నిలబడేవాడిని.

ఒకరోజు నేను ఆయన వద్దకి వెళ్లి, ప్రతీసారి నేనే మీకు దండం పెడుతున్నాను, ఈసారి నేనొచ్చినప్పుడు మీరు నాకు దండం పెట్టాలి అని అన్నాను, అప్పుడు ఆయన నేను నీకు దండం పెట్టాలా రా ‘లం** కొడకా’ అని త్తిట్టాడు, ఆ తర్వాత కొన్నాళ్ళకు ఆయన కూడా నన్ను చూసి పైకి లేచి దండం పెట్టడం నేర్చుకున్నాడు’ అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.

మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సినిమా గుంటూరు కారం, ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేదాం అని సినిమా బృందం అనుకున్నారు కానీ అదే సాధ్యం అయ్యేలా కనిపించటం లేదు. దీనితో ఫాన్స్ త్రివిక్రమ్ పై తెగ మండిపడుతున్నారు.

Exit mobile version