Mrunal Thakur : సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ అవ్వాలని చాలా మంది అమ్మాయిలు కలలు కంటారు. ఈ అవకాశం వస్తే, మీరు దానిని కోల్పోరు. సాధారణంగా, చాలా మందికి తప్పుడు ఆలోచన ఉంటుంది. కథానాయికగా ఇండస్ట్రీలోకి వస్తే సిగ్గు విడిచిపెట్టి ఏదైనా పాత్రలో నటించాలి అని. అందరు ఇలానే అనుకుంటున్నారు. అయితే కొంతమంది హీరోయిన్లు కొన్ని రూల్స్ పెట్టుకొని సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడతారు. అయితే ప్రస్తుతం ఇలాంటి రూల్స్ గురించి మాట్లాడింది మృణాల్ ఠాకూర్.
ఈ అమ్మడు ఇటీవల నటించిన “ఫ్యామిలీ స్టార్” చిత్రం పరాజయం పాలైంది. కానీ ఈ అమ్మడు ఫాలోయింగ్ ఏ మాత్రం తాగడం లేదు. దీనికి కారణం ఆమె అందమే అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల మృణాల్ ఠాకూర్ ఓ ఇంటర్వ్యూ లో పాలుగోన్నారు. ఈ క్రమంలో తన కుటుంబం గురించి మాట్లాడారు. హీరోయిన్ గా మృణాల్ ఇండస్ట్రీకి వస్తానని చెప్పగానే తండ్రికి చెప్పినప్పుడు నో చెప్పలేదు. కానీ వారు ఒకే ఒక్క షరతు పెట్టారు. సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కుటుంబం పేరు చెడకొట్టాడు.
బోల్డ్ సీన్లలో లేదా లిప్ లాక్ ముద్దుల సీన్లలో కనిపించకూడదు. నేను అప్పుడు ఓకే చెప్పాను. అయితే నిన్నటి వరకు తన తండ్రి పెట్టిన షరతును దాటలేదని చెప్పింది. అయితే తాను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కచ్చితంగా ఇలాంటివి చేయాల్సి ఉంటుందని ఇటీవలే తెలుసుకున్నానని చెప్పింది. కొని స్క్రిప్ట్స్ కు ఇవి చాలా అవసరం అని ఆమె అన్నారు. సోషల్ మీడియాలో మృణాల్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.