Home Cinema Nagarjuna: నాగ చైతన్య రెండో పెళ్లి గురించి ప్రకటన చేసిన నాగార్జున.. ఆ అమ్మాయి తోనే...

Nagarjuna: నాగ చైతన్య రెండో పెళ్లి గురించి ప్రకటన చేసిన నాగార్జున.. ఆ అమ్మాయి తోనే పెళ్లి అంటూ..

Nagarjuna: సోషల్ మీడియా లో నిత్యం ట్రెండింగ్ లో ఉండే పేరు అక్కినేని నాగ చైతన్య. ఆయన పెద్ద హీరో కాబట్టి ఆయన పేరు ట్రెండింగ్ లో ఉండడం లో పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు, కానీ ఎప్పుడైతే సమంత తో విడాకులు తీసుకున్నాడో, ఈయన మీద సోషల్ మీడియా లో వచ్చినన్ని కథనాలు ఏ స్టార్ హీరో మీద కానీ, రాజకీయ నాయకుడి మీద కానీ రాలేదు(Naga Chaitanya In Love). ఇది నిజంగా ఎవ్వరూ ఊహించనిది. సౌత్ లోనే మోస్ట్ క్రేజీ కపుల్స్ గా పేరు తెచ్చుకున్న వీళ్ళు ఇలా విడాకులు తీసుకుంటారు అనేది ఎవ్వరూ కలలో కూడా ఊహించలేదు. అందుకే ఈ స్థాయిలో ఈ జంట ట్రెండ్ అయ్యింది.

nagarjuna-naga-chaitanya

ఇకపోతే సమంత నాగ చైతన్య తో విడిపోయిన తర్వాత ఆమె పలానా హీరో తో డేటింగ్ లో ఉన్నట్టు కానీ, పెళ్లి చేసుకోబోతుంది అన్నట్టు కానీ రూమర్స్ రాలేదు కానీ, నాగ చైతన్య మీద మాత్రం చాలానే వచ్చాయి. ఆయన ప్రముఖ హీరోయిన్ శోభిత దూళిపాళ్ల తో ప్రేమలో ఉన్నట్టు గత కొంతకాలం నుండి మీడియా లో ప్రచారం అవుతుంది(Naga Chaitanya In Love). అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ కూడా లేదు, కానీ వీళ్ళు కలిసి ట్రిప్స్ కి వెళ్లడం,ప్రైవేట్ పార్టీలకు వెళ్లడం,దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో లీక్ అవ్వడం చూస్తుంటే ఇప్పుడే వీళ్ళ ప్రేమ వ్యవహారం బయటపెట్టాలని అనుకోవడం లేదని అర్థం అవుతుంది.

కానీ నిజం ఎంత దాచాలన్నా దాగదు, ఎదో ఒక రోజు బయటపడాల్సిందే, వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి లు కూడా గతం లో వాళ్ళ ప్రేమని ఇలాగే దాచాలని చూసారు, కానీ చివరికి ఎదో ఒక రోజు ఓపెన్ అవ్వాలి అన్నట్టు రీసెంట్ గానే నిశ్చితార్థం చేసుకొని అందరికీ ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పుడు నాగ చైతన్య శోభిత దూళిపాళ్ల వ్యవహారం కూడా అలాంటిదే అని అంటున్నారు. అయితే రీసెంట్ గానే అక్కినేని నాగార్జున ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో నాగ చైతన్య ప్రేమ వ్యవహారం గురించి ఒక హింట్ ఇచ్చేసాడు. ఆయన మాట్లాడు ‘ఈమధ్య మా అబ్బాయి సమయానికి ఇంటికి రావట్లేదు,

తినాల్సిన సమయం లో త్రింది తినడం లేదు, ఎప్పుడూ ఫోన్ లోనే ఉంటున్నాడు, ఎదో తేడా కొడుతోంది, కచ్చితంగా ప్రేమలోనే ఉన్నాడు, కానీ బయటపడడం లేదు’ అంటూ నాగార్జున మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. అంటే ఇన్ని రోజులు ప్రచారం అవుతున్న ఆ వార్త నిజమే అన్నమాట. అతి త్వరలోనే శోభిత ను పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు నాగ చైతన్య, విడాకులు తీసుకుని రెండు ఏళ్ళు కూడా కాకపోయేసరికి, ఈ జంట ఇంకొన్ని రోజులు డేట్ చేసి అప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు అంట. నాగ చైతన్య మల్లి పెళ్లి చేసుకోవాలి అని అక్కినేని అభిమానులు ఆశతో ఎదురుచూస్తున్నారు.

Exit mobile version