Nagarjuna : ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో బాగా ట్రెండ్ అయ్యింది. ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున స్థానం చెప్పనక్కర్లేదు. తండ్రి నాగేశ్వరరావు పేరుతో ఇండస్ట్రీకి వచ్చినా తనదైన శైలిలో పనులు చేయడానికి ఇష్టపడతాడు. అయితే నాగార్జున తన 100వ సినిమాను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్లుగా త్రిష, నయనతారలను కన్ఫర్మ్ చేశారు. అంతేకాదు తన సినీ కెరీర్ మొత్తం గుర్తుండిపోయేలా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
నాగార్జున తన 100వ సినిమాలో తన భార్య అమలతో పాటు నాగ చైతన్య అఖిలను కూడా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి ఈ సినిమాని మనం సినిమా అంత పెద్ద హిట్ చేయడానికి కృషి చేయనున్నారు అంటూ టాక్ నడుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రశంసిస్తున్నారు నెటిజనులు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మరి ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం నాగార్జున ఓ కొత్త దర్శకుడిని ఓకే చేసాడు అని తెలుస్తుంది. ఇంకా ఈ సినిమాలో ఓ సాంగ్ లో దాదాపు పది మంది హీరోయిన్లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు నాగార్జున. ఇంతకు ముందు ఈయన ఓ సినిమాలో ఇలానే చేసారు. మల్లి ఆ ట్రెండ్ ను రిపీట్ చేదాం అని నిర్ణయించుకున్నాడు కింగ్.