Home Cinema Star Heroines : త్రిష – నయనతార కు పెద్ద షాక్ ఇచ్చిన హీరోయిన్.. ఎవరో...

Star Heroines : త్రిష – నయనతార కు పెద్ద షాక్ ఇచ్చిన హీరోయిన్.. ఎవరో తెలుసుకోవాలంటే..

Star Heroines : ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు స్టార్ హీరోల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. హీరోయిన్స్ అప్పట్లో ఒక్క సినిమాకు కోటి రూపాయలు తీసుకుంటే పెద్ద చర్చగా మారేది. నిర్మాతలు కూడా మహిళకు అంత రెమ్యూనరేషన్ ఎందుకు అని అడిగేవారట. అయితే ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఏ హీరోయిన్ కూడా కోటి రూపాయల కంటే తక్కువ పారితోషికాన్ని తీసుకోవడంలేదు.

మొదటి సినిమా హిట్టయిందా అంతే ఇక, దాదాపు రెండు నుండి మూడు కోట్ల రూపాయల పారితోషికం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటి వరకు సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్లలో త్రిష, నయనతార పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. నయనతార ఒక్కో సినిమాకి కనీసం 10 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటుంది. త్రిష ఈ మధ్యకాలంలో అదే స్థాయిలో కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటుంది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు హీరోయిన్లకు షాక్ ఇచ్చింది కన్నడ బ్యూటీ రష్మిక మందన్న.

star-heroines-shocked-after-knowing-rashmika-mandanna-remuneration

నిన్నటి వరకు ఐదు కోట్లు ఛార్జ్ చేసిన రష్మిక మందన్న ఇప్పుడు సల్మాన్ ఖాన్ నటించిన సికిందర్ చిత్రానికి దాదాపు 15 కోట్లు వసూలు చేసింది. ఈ వార్త టాలీవుడ్-బాలీవుడ్-కోలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. రష్మిక అభిమానులు ఇప్పుడు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. అయితే, ఆమెకు తన భవిష్యత్తు పరిస్థితి తెలుసునని, అందుకే ఇప్పటి నుండే డబ్బు సంపాదించుకుంటుంది అని కొందరు కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version