Home Cinema Nani : నానికి అది లేదంటూ దారుణంగా అవమానించిన స్టార్ హీరో.. ఎవరంటే..?

Nani : నానికి అది లేదంటూ దారుణంగా అవమానించిన స్టార్ హీరో.. ఎవరంటే..?

Nani : సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన హీరోలు అంటే ప్రతి ఒక్కరు చులకనగా చూస్తారు మరియు ట్రోల్ చేస్తుంటారు. ఇది ప్రతి ఇండస్ట్రీలో జరుగుతుంది. అయినా సరే అనుకుంట ఆ హీరోలు టాలెంట్ ను నమ్ముకొని ఇండస్ట్రీలోకి వస్తే వారిని ఎదగనీయకుండా టార్గెట్ చేసి తోక్కేస్తున్నారు. ఇలాంటివి ఎన్నో గండాలను దాటి తాను కంటూ సెపరేట్ ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు నాచురల్ స్టార్ నాని. నాని హీరో అవ్వకముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు. (Hero Nani)

nani-did-not-have-that-says-tollywood-star-hero

అలా కొని సంవత్సరాలు పని చేసాక నాని అష్ట చమ్మ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. అలా ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు నాచురల్ స్టార్ నాని. ఇటీవల దసరా అనే సినిమాతో మరొక్క మెట్టు ఎక్కాడు. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయ్యింది మరియు పెద్ద సక్సెస్ అందుకుంది. నాని దసరా సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరాడు మరియు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇంతటి టాలెంట్ ఉన్న హీరోను తన కెరీర్ మొదటిలో ఓ స్టార్ హీరో నీచంగా అవమానించాడట.

అష్ట చమ్మ సినిమా ప్రొమోషన్స్ కోసం వెళితే అతను హీరోనా అంటూ హేళనగా మాట్లాడాడంట. ఇతని కంటే కమెడియన్స్ నయం అని నీచంగా మాట్లాడాడు అని నాని ఏ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇపుడు సీన్ కట్ చేస్తే.. నాని పాన్ ఇండియా స్టార్. నానిని అవమానించిన హీరో జాడ కూడా లేదు. అందువలనే ఎవ్వరిని చులకన భావంతో మాట్లాడకూడదు అంటూ నాని చెప్పుకొచ్చారు. ఎవ్వరి టైమ్ ఎప్పుడు ఎలా ఉంటదో ఎవరు అంచనావేయలేరు అంటూ నాని ఫాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

నాని హీరోగా చేసుకుంటూనే కొత్త హీరోలను ప్రోత్సహిస్తూ వారి సినిమాలను తన ఓన్ బ్యానర్ పైన ప్రొడ్యూస్ చేస్తున్నాడు. నాని 2013 లో డి ఫర్ దోపిడీ అనే సినిమాతో ప్రొడ్యూసర్ గా మారాడు. 2018 లో ఆయన మొదటి బ్యానర్ పై అ! అనే సినిమా తీశారు.

ఆ తరువాత 2020 లో విశ్వక్ సేన్ హీరోగా హిట్ అనే ఫ్రాంచైజ్ ప్రొడ్యూస్ చేసాడు నాచురల్ స్టార్ నాని. ఈ సినిమా ప్రొడ్యూసర్ గా నానికి మంచి పేరు తెచ్చిపెట్టింది. విశ్వక్ సేన్ కెరీర్లో ఓ మంచి సినిమాగా నిలిచింది. హిట్ ఫ్రాంచైజ్ కు సీక్వెల్ హిట్ – కేసు 2 తీసి బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నారు. (Hero Nani)

Exit mobile version