Nani: అన్ని ఇండస్ట్రీల కన్నా మన తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే టాలీవుడ్ ఇండస్ట్రీ కి ఉన్నన్ని అభిమానులు మారె ఇండస్ట్రీ కి ఉండరు. RRR సినిమాతో మొత్తం ప్రపంచమే టాలీవుడ్ వేపు చూసేలా చేసాడు డైరెక్టర్ రాజమౌళి. మన ఇండస్ట్రీ లో సినిమా కథ రాసే సమయంలోనే ఒక హీరో ని ఫిక్స్ అయ్యి తన క్యారెక్టర్ కు తగినట్టు సినిమా కథను రాసుకుంటారు రచయితలు. కానీ కొన్ని సార్లు కథ మొత్తం రాసుకున్నాక హీరోకి నచ్చకో, లేదా హీరో డేట్స్ దొరకకో ఇలాంటి మరెన్నో కారణాల వల్ల వేరే హీరో తో చేసేస్తూ ఉంటారు(nani natural star). ఇది చాలా సర్వ సాధారణం ముఖ్యం గా మన టాలీవుడ్ లో.
ఇలా ఒకరికోసం కథ రాసి మరొక హీరోతో చేసిన సినిమా టాలీవుడ్ లో బోలెడన్ని ఉన్నాయి. కానీ ఒక హీరో మాత్రం ఆ కథ బ్లాక్ బస్టర్ అవుతుంది అని తెలిసి, ఆ సినిమా లో ఉన్న హీరోకి డబ్బులిచ్చి నువ్వు డ్రాప్ ఐపో అన్ని జరిగిన సంఘటన ఒకటి ఉంది అని మీకు తెలుసా. ఆ సినిమా మరేదో కాదు హీరో నాని నటించిన శామ్ సింగా రాయ్. హీరో నానికి అప్పటికే 3 ప్లాపులు పడ్డాయి, ఈ సినిమా కథ విన్న మరో హీరో ఆ సినిమా కచ్చితంగా హిట్ కొడుతోంది అని తెలిసి హీరో నాని కి 50 కోట్లు ఆఫర్ చేసి సినిమా నుండి డ్రాప్ ఐపో అన్నాడట. నీకు ఎలాగో 3 ప్లాప్ లు ఉన్నాయి.
ఈ సినిమా నాకిచ్చెయ్ నీకు సినిమా వాలు ఇస్తున్న రెమ్యూనరేషన్ కంటే ఎక్కువ ఇస్తా అని 50 కోట్లు ఆఫర్ చేసాడు ఆ హీరో నాని కి(nani natural star). కానీ నాని అందుకు ఒప్పుకోలేదు, సినిమా తానే చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈ విషయం స్వయంగా హీరో నాని నే తెలియచేసాడు. ఆ హీరో ఎవరు తన పేరు చెప్పండి అని ఇంటర్ వ్యూ చేసే అతను అడగగా, ఒద్దు లెండి పేరులు ఇప్పుడు ఎందుకు అంటూ సైడ్ ఐపోయాడు హీరో నాని. హీరో నాని హిట్ 3 సినిమాలో కనిపించ నున్నాడు. ఈ సినిమా గురించి చివరి ప్రకటన 2022 లో వచ్చింది.
మల్లి ఇప్పటి వరకు ఆ సినిమా పై ఎటువంటి ప్రకటనలను విడుదల చేయలేదు సినిమా బృందం. ఫాన్స్ మాత్రం హిట్ కంటే ముందే నాని 30వ సినిమా రిలీజ్ అవుతుంది అని ప్రచారం చేస్తున్నారు. నాని హాయ్ నాన్న అనే సినెమా కూడా చేస్తున్నాడు, ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ ఈ సినిమా గురించి కూడా ఎటువంటి కొత్త సమాచారం ఐతే ఇంకా విడుదల కాలేదు.
ఫాన్స్ మాత్రం రిలీజ్ అవ్వబొయె నాని సినిమా కోసం చాల వేచి చూస్తున్నారు. ఏ సినిమా మొదట రిలీజ్ అవుతుందో తెలీదు కానీ ఆ సినిమా మాత్రం హిట్ అవ్వటం పక్క అంటున్నారు ఫాన్స్.