Home Cinema Hema : ఈ ఫోటోతో అడ్డంగా దొరికిపోయిన నటి హేమ.. ఇక జైలుకి వెళ్లడం పక్క..

Hema : ఈ ఫోటోతో అడ్డంగా దొరికిపోయిన నటి హేమ.. ఇక జైలుకి వెళ్లడం పక్క..

Hema : నటి హేమ ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలో ఈ పేరు ఎలా వైరల్ అయిందో తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హేమ పలు సినిమాల్లో నటించింది. హేమ హీరోయిన్ తల్లి పాత్రలో, అక్క పాత్రలో బాగా నటించింది. ఆమె ప్రధానంగా కామెడీకి సంబంధించిన పాత్రలను పోషిస్తుంది. తెరపై ఆమెను అభినందించిన వారు చాలా మంది ఉన్నారు. చాలా సంప్రదాయంగా ఉండే హేమ అభిమానులకు బాగా దగ్గరైంది.

అయితే ఇటీవల బెంగళూరులో జరిగిన ఓ రేవ్ పార్టీలో హేమ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. హేమ ఆ పార్టీకి వెళ్లి అక్కడ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ కారణంగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కానీ హేమ బెయిల్‌పై విడుదలై తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పింది. మొత్తం కథ సుఖాంతం అయిందని అభిమానులు భావించారు. అయితే ఒక్కసారిగా ఆమెఓ ఫోటో టాలీవుడ్ ఇండస్ట్రీలో పెను ప్రకంపనలు సృష్టించింది.

new-twist-in-hema-drug-case-as-her-photo-with-dj-siddharth-leaked-on-social-media

ఇటీవల డ్రగ్స్ కేసులో అరెస్టయిన డీజే సిద్ధార్థ్‌తో హేమ దిగిన ఫోటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. డ్రగ్స్ కేసులో అరెస్టయిన డీజే సిద్ధార్థ్ తో హేమ దిగిన ఫోటో ఇప్పుడు సంచలనంగా మారింది. అలాంటి వ్యక్తితో పరిచయం ఎందుకు, అతనూ డ్రగ్స్ కేసులో జైల్లో ఉన్నాడు. మరి హేమతో అతడికి సంబంధం ఏంటి అని చర్చించుకుంటున్నారు నెటిజెన్స్. ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు సోషల్ నెట్‌వర్క్‌లలో ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Exit mobile version