Home Cinema Niharika : 11 మంది హీరోలతో తెరకెక్కనున్న నిహారిక సినిమా..

Niharika : 11 మంది హీరోలతో తెరకెక్కనున్న నిహారిక సినిమా..

niharika-konidela-to-produce-a-movie-with-11-heros-and-4-heroines

నిహారిక కొణిదెల మెగా కుటుంబం నుంచి వచ్చిన మరో ఫెయిల్యూర్ అనే చెప్పుకోవచ్చు. చైతన్య జొన్నలగడ్డను ప్రేమించి పెళ్ళిచేసుకుని విడాకులు కూడా తీసేసుకున్నారు. మెగా కుటుంబం నుండి ఎందరో హీరో, హీరోయిన్ అవుదామని వచ్చారు, కానీ అదృష్టం కొందరికే తట్టింది. నిహారిక కూడా ఎన్నో సినిమాలు చేసింది కానీ ఏవి సక్సెస్ కాలేదు. తను అనుకున్న పాపులారిటీ రాక పోవటంతో తిను వెబ్ సిరీస్ లో నటించటం ప్రారంభించింది. అవి కూడా సక్సెస్ అవ్వకపోవటం తో ఇప్పుడే తానే ఒక ప్రొడ్యూసర్ గా మరి సొంత ప్రొడక్షన్ హౌస్ ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ అని ప్రారంభించింది.

ఈ బ్యానర్ కింద ఇప్పటికే పలు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ చేసింది నిహారిక. ఇప్పుడు అదే బ్యానర్ కింద ఒక యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా చేయబోతుంది. ఆ సినిమా పేరు ‘కమిటీ కుర్రాళ్ళు’. ఈ సినిమాలో మొత్తం 11 మంది హీరోలు, 4 హీరోయిన్లు. అందరిని కొత్తగా టాలీవుడ్ కి పరిచయం చేయనుంది నిహారిక. ఇక తాను కూడా విడాకుల తరువాత గ్యాప్ తీసుకుని ఒక సినిమాలో నటిస్తుంది, ఆ సినిమా పేరు ‘వాట్ ది ఫిష్’. సుమారు 5 ఏళ్ళ తరువాత ఒక సినిమాలో కనిపించనుంది మెగా డాటర్ నిహారిక. మరి ఆ సినిమాతో అయినా సక్సెస్ వస్తుందా లేదా అని వేచి చూడాల్సిందే.

Exit mobile version