Home Cinema ఎన్టీఆర్ తన కొడుకులని సినిమాల్లోకి రానివ్వడట.. ఆ వృత్తిలో దింపుతాడట..

ఎన్టీఆర్ తన కొడుకులని సినిమాల్లోకి రానివ్వడట.. ఆ వృత్తిలో దింపుతాడట..

నందమూరి తారక రామ రావు మొన్నటివరకు టాలీవుడ్ సూపర్ స్టార్, ట్రిపుల్ ఆర్ సినిమా తరువాత గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయారు. ఇప్పుడు ఎన్టీఆర్ అంటే కేవలం దేశం కాదు మొత్తం ప్రపంచమే గుర్తుపట్టే స్థాయికి ఎదిగాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ కు సంబందించిన ఏ వార్తయిన నెట్టింట ఇట్టే వైరల్ అవుతుంది. తన నటనతో, డాన్స్ తో కోట్లాది మంది అభిమానం సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్.

ప్రస్తుతం ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివతో కలిసి దేవర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. ఇప్పటికే సకానికి పైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమా నుండి ఇప్పటికే లీక్ అయినా చాల పిక్స్, వీడియోస్ నెట్టింట తెగ హల్ చల్ చేసాయి. ప్రస్తుతం హీరో ఎన్టీఆర్ గురించి ఒక వార్త వైరల్ అవుతుంది.

ntr-with-sons

సాధారణంగా ప్రతి హీరో తన కొడుకుని హీరో చేయాలి అని అనుకుంటారు. ఇది చాల సర్వ సాధారణం, కానీ ఎన్టీఆర్ మాత్రం తన కొడుకులని (భార్గవ్ రామ్ – అభయ్ రామ్) లను హీరో కాకుండా వారికి బాగా ఇష్టమైన వృత్తిలో దింపుదాం అని అనుకుంటున్నాడు అట. వారిని నలుగురికి పనికివచ్చే వృత్తి అయిన వ్యాద్య వృత్తిలో దింపుదాము అని ఫిక్స్ అయ్యాడు అట. దీనికి తన భార్య ప్రణతి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అట. పిల్లలకు కూడా డాక్టర్ అవ్వాలి అని చిన్నపాటి నుండి కోరిక అట. ఎన్టీఆర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభిమానులు కొంత బాధతో జీర్ణించుకుంటున్నారు.

Exit mobile version